Year Ender 2021: రూ.5,000 లోపు బెస్ట్ స్మార్ట్​వాచ్​ కావాలా? వీటిని ట్రై చేయండి..

Year Ender 2021: 2021 ముగింపు దశకు చేరుకుంది. మరి ఈ ఏడాది విడుదలైన బెస్ట్ స్మార్ట్​ వాచ్​లు.. అది కూడా బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చిన వాటి పూర్తి వివరాలు మీకోసం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2021, 06:59 PM IST
Year Ender 2021: రూ.5,000 లోపు బెస్ట్ స్మార్ట్​వాచ్​ కావాలా? వీటిని ట్రై చేయండి..

Year Ender 2021: టెక్ ప్రపంచానికి 2021 ఎంతో ప్రత్యేకమైంది. గతంతో పోలిస్తే క్లిష్టమైన పరిస్థితి ఉన్నప్పటికి కొత్త కొత్త గాడ్జెట్లు మార్కెట్లోకి వచ్చాయి. స్మార్ట్​ఫోన్లు నుంచి స్మార్ట్​  వాచ్​ల వరకు అనేక గాడ్జెట్స్​ను విడుదల చేశాయి పలు ఎలక్ట్రానిక్ కంపెనీలు. ఈ ఏడాదికి ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. మరి ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన రూ.5000 లోపు బెస్స్​ స్మార్ట్ వాచ్​ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

షియోమీ రెడ్​మీ వాచ్​(Xiaomi Redmi Watch)..

భారీ ఫీచర్లతో వచ్చిన బడ్జెట్ వాచ్​గా దీనిని చెప్పొచ్చు. దీని ధర రూ.3,999.

ఇందులో 11 స్పోర్ట్స్ మోడ్​లు ఇవ్వనున్నాయి. రన్నింగ్, హైకింగ్, సైక్లింగ్​, స్విమ్మింగ్​, క్రికెట్​ మోడ్​లు ఉన్నాయి. ఇందులో హెల్త్ సంబంధిత ఫీచర్లు కూడా ఉండటం విశేషం. హార్ట్​బీట్ రేటు, నిద్ర సమయం, ఎయిర్​ ప్రేషర్​, స్పెప్స్ కౌంటింగ్ వంటివి ఉన్నాయి. 1.4 అంగుళాల డిస్​ప్లే ఉందులో ఉంటుంది.

డిజో వాచ్​ 2 (Dizo Watch 2)

భారీ బ్యాటరీ బ్యాకప్​తో వచ్చిన స్మార్ట్​వాచ్​ ఇది. దీని ధర రూ.2,499.

ఇది మెటల్​ ఫ్రేమ్​తో అందుబాటులో ఉంది. ఇందులో ఏకంగా 15 రకాల మోడ్స్ ఉంటాయి. దీనితో పాటు 100 కన్నా ఎక్కువ వాచ్ ఫేస్​లు, వాటర్​ రెసిస్టెంట్ సపోర్ట్ వంటివి దీని ప్రత్యేకత. ఈ వాచ్​లో కూడా హెల్త్​కు సంబంధించిన ఫీచర్లు ఉన్నాయి. గుండే స్పందన పర్యవేక్షణ ఫీచర్ కూడా ఉంది.

రియల్​మీ వాచ్​ 2 (Realme Watch 2)

రియల్మీ తీసుకొచ్చిన బజ్జెట్ స్మార్ట్ వాచ్​గా దీనిని చెప్పొచ్చు. దీని ధర రూ.3,499.

ఇందులో 1.4 అంగుళాల టచ్ స్కీన్​ డిస్​ప్లే ఉంటుంది. 315 ఎంఏహెచ్ బ్యాటరీని పొందు పరిచింది రియల్​మీ. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) సపోర్ట్​తో పని చేస్తుంది. వరట్​ ప్రూఫ్ కూడా. రియల్​టైమ్ హార్ట్ రేట్ మానిటరింగ్​, 90 స్పోర్ట్స్​ మోడ్​లు దీని ప్రత్యేకత.

ప్లేఫిట్ స్లిమ్​ (Playfit Slim)

రౌండ్​గా అల్యూమినియం డయల్​తో ఈ వాచ్ అందుబాటులో ఉంది. దీని ధర రూ.3,999.

ఇందులో వివిధ స్పోర్ట్స్ మోడ్​లతో పాటు.. హెల్త్ ట్రాకర్స్ కూడా ఉన్నాయి. ఇది పూర్తిగా వాటర్​ రెసిస్టెంట్. హార్ట్ బీట్​ రేట్​ సెన్సార్​, స్లీపింగ్ ట్రాకర్​ వంటివి దీని ప్రత్యేకతలు.

ఫైర్​ బోల్ట్​ 360 (Fire Boltt 360)

ఈ వాచ్​ ఎస్​పీఓ2 మానిటర్​తో అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.3,999.

ఇందులో హెల్త్​ ట్రాకింగ్ ఫీచర్లు భారీగా ఉన్నాయి. హార్ట్ బీట్​ రేట్​, బీపీ మానిటర్​ వంటి సెన్సర్లను పొందుపరిచింది కంపెనీ. బ్లాక్, గ్రే, గోల్డ్ కలర్ వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది.

Also read: EPFO e-nomination: ఈపీఎఫ్ఓ గుడ్​ న్యూస్​- ఈ-నామినేషన్ గడువు పెంపు!

Also read: Flipkart Year End Sale: రూ.19,999 ధర గల Realme 8s 5g స్మార్ట్ ఫోన్ కేవలం రూ.549కే..త్వరపడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News