Yamaha RD350 Launch 2023: యమహా ఆర్‌డి 350 వచ్చేస్తుంది.. షాకింగ్ వివరాలు లీక్!

Yamaha RD350 Launch Likely in India Soon. కొన్నేళ్ల క్రితం భారత్‌లో ఆదిపత్యం చెలాయించిన బైక్‌ను యమహా కంపెనీ త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది.  

Written by - P Sampath Kumar | Last Updated : May 6, 2023, 05:47 PM IST
Yamaha RD350 Launch 2023: యమహా ఆర్‌డి 350 వచ్చేస్తుంది.. షాకింగ్ వివరాలు లీక్!

Yamaha Plans to Re-Launch Yamaha RD350 in India: ఇండియన్ మోటార్‌సైకిల్ మార్కెట్లో మిడిల్ వెయిట్ సెగ్మెంట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందులకే చాలా కంపెనీలు సెగ్మెంట్‌లో తమ ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌ను 'రాయల్ ఎన్‌ఫీల్డ్' శాశిస్తోంది. జపాన్‌కు చెందిన వాహన తయారీ సంస్థ 'యమహా' కూడా మిడిల్‌ వెయిట్ విభాగంలోకి ప్రవేశించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. యమహా ప్రస్తుతం భారతదేశంలో మంచి డిమాండ్ ఉన్న యమహా బైక్‌లను కలిగి ఉంది. అందులో యమహా 250cc FZ 25 మరియు యమహా FZS 25 ఉన్నాయి. అయితే కొన్నేళ్ల క్రితం భారత్‌లో ఆదిపత్యం చెలాయించిన బైక్‌ను యమహా కంపెనీ త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది.

భారతదేశంతో సహా అనేక ప్రపంచ మార్కెట్లలో రెట్రో స్టైల్ బైక్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే భారతదేశంలో పాత పాపులర్ బైక్‌లను కొత్త అవతార్‌లో తీసుకువచ్చేందుకు అనేక కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. యమహా కూడా అలాంటి బైక్‌నే తీసుకొస్తుంది. యమహా కంపెనీ ఇటీవల జపాన్‌లో RZ350 మరియు RZ250 కోసం ట్రేడ్‌మార్క్‌ను దాఖలు చేసింది. భారతదేశంలో రెట్రో బైక్‌లకు ఉన్న క్రేజ్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. యమహా కూడా RZ350 మరియు RZ250లను పరిచయం చేసే అవకాశం ఉంది. RD350 భారతదేశంలో 1980 మరియు 1990లలో విక్రయించబడింది. బైక్ దాని క్లాసిక్ డిజైన్ మరియు శక్తివంతమైన పనితీరు కారణంగా చాలా ప్రజాదరణ పొందింది. ఇప్పటికీ చాలా మంది కస్టమర్లు RD350ని వాడుతున్నారు.

RD350ని మోడరన్ క్లాసిక్‌గా యమహా కంపెనీ ఈ బైక్‌ను రీలాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ 350cc, హోండా హెచ్'నెస్ CB350, జావా/యెజ్డీ మరియు రాబోయే బజాజ్-ట్రయంఫ్ మరియు హీరో-హార్లీ బైక్‌లతో పోటీపడుతుంది. పాత యమహా (Yamaha RD350) 347cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో వచ్చింది. ఈ ఇంజన్ గరిష్టంగా 39 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇక 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో రన్ అవుతుంది. కొత్త అవతార్‌లో ఇది ఫోర్-స్ట్రోక్ ఇంజిన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ బైక్ DRL, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, డ్యూయల్-ఛానల్ ABS, బ్లూటూత్ కనెక్టివిటీ, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ మరియు అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్‌తో LED హెడ్‌ల్యాంప్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

Also Read: Rakul Preet Singh Bikini: బికినీలో రకుల్ ప్రీత్ సింగ్.. హాట్ అందాలతో మంచునే కరిగించేస్తుందిగా!   

Also Read: Anrich Nortje IPL 2023: అసలే వరుస పరాజయాలు.. ఆపై మరో స్టార్ ప్లేయర్ ఔట్! ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి దారుణం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News