Old Pension Scheme: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తొలిసారి ప్రకటించడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. 2022 మార్చిలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో ఏడు లక్షల మంది ఉద్యోగులకు పాత పెన్షన్‌ను పునరుద్ధరిస్తామని ఆయన ప్రకటించారు. రాజస్థాన్ తర్వాత పంజాబ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు కూడా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.
ఆన్‌లైన్ సమావేశం బహిష్కరణ
పాత పెన్షన్ విధానాన్ని గతంలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు అమలు చేశాయి. పంజాబ్‌లో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేందుకు ఆప్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేస్తున్నా.. కేంద్రం నుంచి దీనిపై ఎలాంటి స్పందన లేదు. పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలని కార్మిక సంఘాలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను డిమాండ్ చేశాయి. ఈ నేపథయంలోనే కార్మిక సంఘాల నాయకులు ఆన్‌లైన్ సమావేశాన్ని బహిష్కరించారు.
భవిష్యత్ తరాలపై పన్ను భారం
మళ్లీ పాత పెన్షన్ విధానం అమలు చేయడం భావితరాలకు భవిష్యత్ తరాలకు మంచి చేస్తుందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాలు పాత పెన్షన్ స్కీమ్‌ను అమలు చేస్తే.. రాబోయే కాలంలో వారికి ఇబ్బందులు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో రానున్న ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతుందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ఈ చర్య భవిష్యత్తులో పన్ను చెల్లింపుదారులపై భారం పడుతుందని నీతి ఆయోగ్ డిప్యూటీ చైర్మన్ బెర్రీ గతంలోనే స్పష్టంగా చెప్పారు.
పాత పెన్షన్ పథకం అంటే ఏమిటి..?
ఈ పథకంలో పదవీ విరమణ సమయంలో జీతంలో సగం ఉద్యోగికి పెన్షన్‌గా అందజేస్తారు. పాత పెన్షన్ స్కీమ్ కింద జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) అందించారు. ఈ పథకంలో ఉద్యోగి రూ.20 లక్షల వరకు గ్రాట్యుటీని పొందే సౌకర్యం ఉంది. ప్రతి ఆరు నెలల తర్వాత డీఏ పెరుగుతుంది. ఈ పథకం కింద ప్రభుత్వ ఖజానా నుంచి పెన్షన్ మొత్తాన్ని చెల్లిస్తారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగి మరణిస్తే.. నిబంధనల ప్రకారం అతని కుటుంబ సభ్యులు పెన్షన్ మొత్తాన్ని పొందుతారు. ఈ పథకంలో ఉద్యోగి జీతం నుంచి ఎటువంటి నగదును కట్ చేయరు.
కొత్త పెన్షన్ పథకం ఇలా..
కొత్త పెన్షన్ పథకంలో మూల వేతనం, డీఏలో 10 శాతం మినహాయిస్తారు. నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) పూర్తిగా స్టాక్ మార్కెట్ కదలికపై ఆధారపడి ఉంటుంది. ఇందులో 60 ఏళ్ల తర్వాత పెన్షన్ పొందాలంటే ఎన్‌పీఎస్ ఫండ్‌లో 40 శాతం పెట్టుబడి పెట్టాలి. అంటే 60 శాతం డబ్బులో మీకు పెన్షన్ వస్తుంది. ఈ పథకంలో పదవీ విరమణ తర్వాత పెన్షన్‌కు ఎలాంటి హామీ ఉండదు. బంధువులకు కూడా ఎలాంటి సౌకర్యమూ లేదు. ఇందులో డీఏ పెంచే నిబంధన లేదు.
అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో పాత పెన్షన్ స్కీమ్ (OPS) రద్దు చేసిన సంగతి తెలిసిందే. జనవరి 2004 నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ విధానం కాంట్రిబ్యూషన్ బేస్డ్ పెన్షన్ స్కీమ్, డియర్‌నెస్ అలవెన్స్‌ని అందించడం లేదు. అందుకే ఉద్యోగులు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశతో ఎదురుచూస్తున్నారు.
Also Read: Revanth Reddy: రంగంలోకి రేవంత్ రెడ్డి టీమ్.. అలర్ట్ అయిన సీనియర్లు.. హైకమాండ్‌కు ఫిర్యాదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook