Whatsapp Data Transffer: ఐవోఎస్ ఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు డేటా ఎలా బదిలీ చేయాలి, వాట్సప్ మరో ఫీచర్

Whatsapp Data Transffer: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్‌లో అద్భుతమైన ఫీచర్లు అందుబాటులో వచ్చాయి. అయితే చాలాకాలంగా యూజర్లు కోరుకుంటున్న మరో గొప్ప ఫీచర్ ఇప్పుడు అందుబాటులో వచ్చేసింది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 21, 2022, 04:28 PM IST
Whatsapp Data Transffer: ఐవోఎస్ ఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు డేటా ఎలా బదిలీ చేయాలి, వాట్సప్ మరో ఫీచర్

Whatsapp Data Transffer: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్‌లో అద్భుతమైన ఫీచర్లు అందుబాటులో వచ్చాయి. అయితే చాలాకాలంగా యూజర్లు కోరుకుంటున్న మరో గొప్ప ఫీచర్ ఇప్పుడు అందుబాటులో వచ్చేసింది. ఆ వివరాలు మీ కోసం..

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వాట్సప్ యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్‌కు చాట్ హిస్టరీ బదిలీ చేయాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. ఈ సౌకర్యం కోసం చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నారు. అలా నిరీక్షించేవారికి గుడ్‌న్యూస్. ఇప్పుడు వాట్సప్‌లో ఆ ఫీచర్ కూడా వచ్చేసింది. మొన్నటివరకూ ఈ సౌకర్యం కేవలం బీటా యూజర్లకుండేది. ఇప్పుడు అందరికీ అందుబాటులో వచ్చింది. మీ ఎక్కౌంట్ ఇన్‌ఫో, ప్రొఫైల్ ఫోటో, గ్రూప్ చాట్, చాట్ హిస్టరీ, మీడియా సెట్టింగ్స్ అన్నీ బదిలీ అయిపోతాయి. మీ డేటా పూర్తిగా ఏదీ మిస్సవకుండా బదిలీ అవుతుంది. 

ఐవోఎస్ నుంచి ఆండ్రాయిడ్‌కు డేటా ఎలా బదిలీ చేయాలి

వాట్సప్ అందించిన సమాధానాల ప్రకారం ఐవోఎస్ 15.5 లేదా తరువాతి వెర్షన్‌పై నడిచే ఐఫోన్, ఆండ్రాయిడ్ 5 ఫోన్ ఉండాలి. ఇది కాకుండా మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో వాట్సప్ వెర్షన్ 2.22.7.74  ఉండాలి. ఐవోఎస్ డివైస్‌లో అయితే వాట్సప్ వెర్షన్ 2.22.10.70 అవసరమౌతుంది. అటు ఐఫోన్ కూడా కొత్తది లేదా ఫ్యాక్టరీ రీసెటా్ అయుండాలి. అటు ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఐవోఎస్ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుండాలి. మీ కొత్త ఐవోఎస్ డివైస్‌లో ఒకటే ఫోన్ నెంబర్ యూజ్ చేసుండాలి. రెండు ఫోన్లు ఒకే వైఫై నెట్‌వర్క్‌తో కనెక్ట్ అవాలి. 

ఇంకా ఇతర స్టెప్స్‌ను FAQ పేజిలో చూడవచ్చు. అందులో ఇచ్చిన స్టెప్స్ ప్రకారం ఫాలో అయితే మీ డేటా బదిలీ అవుతుంది. బదిలీ అయ్యే మీ డేటా రహస్యంగా ఉంటుంది. డేటా బదిలీ తరువాత పాత ఫోన్ నుంచి డేటా డిలీట్ చేయవచ్చు. కాల్ హిస్టరీ, కాంటాక్ట్ నేమ్స్ మాత్రం బదిలీ కావు. 

Also read; Car for Sale: కేవలం రూ.50 వేలు, అంతకన్నా తక్కువ ధరకే అమ్మకానికి కార్లు.. పూర్తి వివరాలివే..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News