Railway Bonus: రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక, 78 రోజుల జీతం బోనస్

Railway Bonus: దీపావళికి ముందే రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త విన్పించింది. ఏకంగా రెండున్నర నెలల జీతాన్ని బోనస్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 12, 2022, 06:00 PM IST
Railway Bonus: రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక, 78 రోజుల జీతం బోనస్

Railway Bonus: ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు నిర్ణయంతో దసరా కానుక ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించింది. దీపావళికి ముందే రైల్వే ఉద్యోగులు ఎదురుచూస్తున్న బోనస్ ప్రకటన వెలువడింది. 

ప్రధాని మోదీ నేతృత్వంలో భేటీ అయిన కేంద్ర మంత్రిమండలి రైల్వే ఉద్యోగుల బోనస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 78 రోజుల జీతాన్ని బోనస్‌గా ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 11.27 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. మొత్తం 11 లక్షల 27 వేలమంది రైల్వే ఉద్యోగులకు 1832 కోట్ల రూపాయల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ఇవ్వనున్నారు. 78 రోజుల జీతం అందనుంది. ఇది గరిష్టంగా 17,951 రూపాయలుంటుంది.

గుజరాత్‌లో కంటెయినర్ టెర్మినల్

కేబినెట్‌లో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గుజరాత్‌లోని కాండలాలో దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీలో భాగంగా కంటెయినర్ టెర్మిల్, మల్టీ పర్పస్ కార్గో బెర్త్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికోసం దాదాపు 6 వేల కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గుజరాత్ ప్రజలకు మేలు చేకూరనుంది. 

Also read: Today Gold rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్... మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News