iPhone 15 Offers: ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ ఆఫర్, ఏకంగా 31 వేలు తగ్గింపు

iPhone 15 Offers: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ప్రస్తుతం మార్కెట్ ఉన్న 90వేల ఖరీదైన ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ అందుతోంది. అతి తక్కువ ధరకే ఈ ఫోన్ మీరు సొంతం చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 19, 2024, 05:03 PM IST
iPhone 15 Offers: ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ ఆఫర్, ఏకంగా 31 వేలు తగ్గింపు

iPhone 15 Offers: ఐఫోన్ 15 కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. మీ కోసం బెస్ట్ డీల్ ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లను ఉపయోగించుకుంటే చాలా తక్కువ ధరకే ఐఫోన్ 15 మీ సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్ 15పై ఎక్స్చేంజ్ ఆఫర్లు, డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు ఇలా చాలానే ఉన్నాయి. అదే యూనికార్న్ వెబ్‌సైట్ లేదా స్టోర్ నుంచి ఐఫోన్ 15 256 జీబీ వేరియంట్ కొనుగోలు చేస్తే ఇంకా మంచి డిస్కౌంట్ లభిస్తుంది. 89,900 వేల ఖరీదైన ఐఫోన్ 15 ను అతి తక్కువ ధరకు ఎలా పొందవచ్చో పరిశీలిద్దాం. 256 జీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 15 యూనికార్న్ స్టోర్ నుంచి కొనుగోలు చేస్తే యూనికార్న్ స్టోర్ మీకు నేరుగా 12.5 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. మరోవైపు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా 6000 రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చు. పాత ఐఫోన్ 12 ఎక్స్చేంజ్ చేస్తే మరో 10 వేల రూపాయలు తగ్గుతాయి. అంతేకాకుండా ఎక్స్చేంజ్ బోనస్ 4 వేలు తగ్గుతాయ. అయితే ఎక్స్చేంజ్ విలువ అనేది మీ పాత ఫోన్ కండీషన్ బట్టి ఉంటుంది. ఇప్పుుడు ఈ డిస్కౌంట్లను లెక్కిస్తే..

ఐఫోన్ 15 256 జీబీ వేరియంట్ ఫోన్ ధర 89,900 కాగా స్టోర్ డిస్కౌంట్ 11,238 రూపాయలు పోగా 78,662 రూపాయలు అవుతుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఆఫర్ 6 వేలు మినహాయిస్తే 72,662 రూపాయలు. దీనిపై ఐఫోన్ 12 ఎక్స్చేంజ్ చేస్తే మరో 10 వేలు తగ్గి 62,662 రూపాయలు అవుతుంది. ఇక ఎక్స్చేంజ్ బోనస్ 4 వేలు మినహాయిస్తే 58,662 రూపాయలకు లభిస్తుంది.

అదే ఐఫోన్ 15 ఆన్‌లైన్ కొనుగోలు చేస్తే 13 శాతం డిస్కౌంట్ అంటే 11,687 రూపాయుల తగ్గుతుంది. అంటే అన్ని డిస్కౌంట్లు మినహాయిస్తే 58,213 రూపాయలకే పొందవచ్చు. ఐఫోన్ 15లో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా ఉంటుంది. ఏ16 బయోనిక్ చిప్‌సెట్ కలిగి ఉంటుంది. 3,349 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది.

Also read: Diabetes Control Tips: బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపు చేసే ఆరు అద్భుతమైన పద్ధతులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News