Ultratech India Cement : అల్ట్రాటెక్ చేతికి ఇండియా సిమెంట్స్..మరి చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఏంటి..?

UltraTech-India Cements Deal : సిమెంట్ రంగంలో భారీ కొనుగోళ్లకు తెర లేచింది. తాజాగా ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌ దక్షిణ భారత దేశంలో అతి పెద్ద సిమెంటు కంపెనీగా పేరొందిన  ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌ (ఐసీఎల్‌) కంపెనీని టేకోవర్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.  

Written by - Bhoomi | Last Updated : Jul 29, 2024, 02:07 PM IST
Ultratech India Cement : అల్ట్రాటెక్ చేతికి ఇండియా సిమెంట్స్..మరి చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఏంటి..?

UltraTech-India Cements:సిమెంట్ రంగంలో భారీ కొనుగోళ్లకు తెర లేచింది. తాజాగా ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌ దక్షిణ భారత దేశంలో అతి పెద్ద సిమెంటు కంపెనీగా పేరొందిన  ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌ (ఐసీఎల్‌) కంపెనీని టేకోవర్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి కంపెనీ ప్రమోటర్‌ ఎన్‌.శ్రీనివాసన్‌ అలాగే ఆయన కుటుంబసభ్యులకు చెందిన 32.72 శాతం వాటాను రూ.3,954 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఇందుకోసం ఒక్కో ఐసీఎల్‌ షేరుకు రూ.390 చొప్పున చెల్లించినట్లు అల్ట్రాటెక్ సిమెంట్ ప్రకటించింది.

ఇదిలా ఉంటే గత జూన్‌ మాసంలో అల్ట్రాటెక్ సిమెంట్‌ ఈ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇండియా సిమెంట్స్ కు చెందిన 23 శాతం వాటాను డీమార్ట్‌ అధినేత, ప్రముఖ ఇన్వెస్టర్‌ ఆర్‌కే దమానీ నుంచి బ్లాక్‌ డీల్‌ రూపంలో కొనుగోలు చేసింది. ఇప్పుడు ఇండియా సిమెంట్స్ అధినేత నుంచి 32.72 శాతం వాటా కొనుగోలుతో  ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ ఈక్విటీలో అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ వాటా సుమారు 55 శాతానికి పెరనున్న నేపథ్యంలో కంపెనీలో మెజారిటీ వాటాదారుగా ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్స్ కు ఇండియా సిమెంట్స్ బోర్డు లో చైర్మన్ పదవికి  దక్కనుంది. 

అయితే ఈ కార్పొరేట్ డీల్ అనంతరం మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది అదే చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్ జట్టు భవితవ్యం. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్  ఐపిఎల్ జట్టు ఇండియా సిమెంట్స్  ఆధ్వర్యంలో నడుస్తోంది.  ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత సక్సెస్ అందుకున్న  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు  ఇకపై అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యం చేతుల్లోకి వెళుతుందా అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది.  అయితే దీనికి సంబంధించి ఇండియా సిమెంట్స్ తరఫు నుంచి  ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

Also Read: Stock Market: లాభాల్లో మార్కెట్లు ..ఆల్ టైమ్ హై రికార్డ్‎ను క్రాస్ చేసిన సెన్సెక్స్..గరిష్టస్థాయికి నిఫ్టీ..!!  

దీనిపై క్రిక్ బజ్ వెబ్ పోర్టల్ ఆసక్తికరమైన కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్వతంత్ర సంస్థ అని CSKCL CEO కాశీ విశ్వనాథన్ ఈ కథనంలో క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ 2015లో ఇండియా సిమెంట్స్ సంస్థ నుంచి వేరుపడిందన్నారు. అంతేకాదు చెన్నై సూపర్ కింగ్స్, ఇండియా సిమెంట్స్ వేర్వేరు సంస్థలుగా ఉన్నాయని. ఇండియా సిమెంట్స్ CSK జట్టును నియంత్రించడం లేదని ఆయన తెలిపారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును చెన్నై సూపర్ కింగ్స్  క్రికెట్ లిమిటెడ్ (CSKCL) అనే సంస్థ నిర్వహిస్తోందని ఆ సంస్థ  CEO కాశీ విశ్వనాథన్ క్రిక్‌బజ్‌ వెబ్ పోర్టల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Also Read: Pan Card Misuse: పాన్ కార్డుతో భారీ మోసాలు, మీ పాన్ కార్డు ఎంత వరకూ భద్రమో ఇలా చెక్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News