Aadhaar Card Update: యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా స్థూలంగా చెప్పాలంటే యూఐడీఏఐ జారీ చేసే ఆధార్ కార్డును ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలి. అడ్రస్ మారినప్పుడు, ఫోన్ నెంబర్ మారినప్పుడైతే తప్పనిసరిగా అప్డేట్ చేయాల్సిందే. అందుకే ప్రభుత్వం కూడా ఆధార్ అప్డేట్ ఉచితంగా అందిస్తోంది.
ఆధార్ కార్డులో కొన్ని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసే వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఆధార్ అప్డేట్ గడువు తేదీని ప్రభుత్వం ఇప్పుడు మరోసారి పొడిగించింది. గత పదేళ్లుగా ఆధార్ కార్డు అప్డేట్ చేయని వారికి ఇదొక మంచి అవకాశం. ఎలాంటి ఫీజు లేకుండా మీ ఆధార్ కార్డును అప్డేట్ చేయించుకోవచ్చు. ఈసారి గడువు తేదీని మరో మూడు నెలలు అంటే 31 మార్చ్ 2024 వరకూ పొడిగించారు. ఈ సమయంలో అడ్రస్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఫోటో, బయోమెట్రిక్ వంటి వివరాల్ని ఎలాంటి ఫీజు లేకుండా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డుల్ని అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ విజ్ఞప్తి చేస్తోంది.
మరీ ముఖ్యంగా గత పదేళ్లుగా ఆధార్ కార్డు సమాచారాన్ని లేదా బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయనివారి కోసం యూఐడీఏఐ విజ్ఞప్తి జారీ చేసింది. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా ఎవరికివారు myAadhaar portal ద్వారా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. లేదా సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి అప్డేట్ చేసుకోవచ్చు.
ఆధార్ కార్డు ఆన్లైన్ అప్డేట్ ఎలా
ముందుగా https://myaadhaar.uidai.gov.in/.అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేసి ధృవీకరించుకోవాలి. అప్డేట్ ఆధార్ ఆన్లైన్ ప్రక్రియను ఎంచుకోవాలి. ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ కార్డులో కావల్సిన వివరాలు నమోదు చేసుకోవాలి. మీ అప్డేట్ స్టేటస్ చెక్ చేసేందుకు 14 నెంబర్ల యూఆర్ఎన్ నెంబర్ సిద్ధంగా ఉంచుకోవాలి.
Also read: Top 5 Electric Cars: 15 లక్షల కంటే తక్కువకు లబించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook