Aadhaar Card: ఆధార్ కార్డులో ఈ అప్‌డేట్ లేకపోతే..అన్నీ సమస్యలే

Aadhaar Card: ఆధార్ కార్డు విషయంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ వెలువడుతుంటాయి. అప్‌డేట్స్ ఫాలో కాకపోతే సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 5, 2022, 09:37 PM IST
Aadhaar Card: ఆధార్ కార్డులో ఈ అప్‌డేట్ లేకపోతే..అన్నీ సమస్యలే

దేశంలో ప్రతి పనికీ అవసరమైంది ఆధార్ కార్డు. ఆధార్ కార్డులో ఏ ఒక్కటి అప్‌డేట్ కాకపోయినా అన్నీ కష్టాలే. మరీ ముఖ్యంగా మొబైల్ నెంబర్ తప్పకుండా అప్‌డేట్ చేయాల్సిందే. ఆన్‌లైన్ విధానంలోనే మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఇప్పుడు ప్రతి పనికీ ఆధార్ కార్డు అవసరం. ప్యాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, రేషన్ కార్డు ఎలా అవసరమో ఇప్పుడు ఆధార్ కార్డు కూడా అంతే అవసరం. ఆధార్ కార్డు అన్నింటికీ ఐడీ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు. ఆధార్ కార్డులో పేరు, రిజిస్టర్ సెల్ ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ, అడ్రస్ వంటి వివరాలన్నీ ఉంటాయి.

ఆధార్ కార్డు అప్‌డేట్

ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ ఎప్పుడూ అప్‌డేట్ అయుండాలి. ఎందుకంటే మొబైల్ నెంబర్ అప్‌డేట్ లేకపోతే..ఇతర వివరాలేవీ అప్‌డేట్ చేసేందుకు వీలుకాదు. ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్‌ను ఆన్‌లైన్ విధానంలో మార్చవచ్చు. ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసేందుకు కొన్ని సులభమైన పద్ధతులున్నాయి.

ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ ఆన్‌లైన్ విధానంలో ఎలా అప్‌డేట్ చేయడం

యూఐడీఏఐ వెబ్ పోర్టల్ uidai.gov.in ఓపెన్ చేయాలి. రిజిస్టర్ చేయాల్సిన ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత క్యాప్చా నమోదు చేయాలి. ఇప్పుడు సెండ్ ఓటీపీ ఆప్షన్ ఎంచుకుని..ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇప్పుడు సబ్మిట్ ఓటీపీ అండ్ ప్రోసీడ్ ఎంచుకోవాలి.

స్క్రీన్‌పై Online Aadhaar Services డ్రాప్‌డౌన్ కన్పిస్తుంది. మీరు దేన్ని అప్‌డేట్ చేయాలనుకుంటున్నారో..దాన్ని క్లిక్ చేయాలి. మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసేందుకు ఆ ఆప్షన్ ఎంచుకోవాలి. అవసరమైన వివరాలివ్వాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తరవాత కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు క్యాప్చా ఎంటర్ చేయాలి. మళ్లీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ధృవీకరణ పూర్తయ్యాక..సేవ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేయాలి. చివరిగా ఆన్‌లైన్ అపాయింట్ మెంట్ తీసుకుని సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. 90 రోజుల్లోగా మీ మొబైల్ నెంబర్ అప్‌డేట్ పూర్తవుతుంది.

Also read: Home Loan Interest Rates: భారీగా పెరిగిన హోమ్ లోన్ వడ్డీ రేట్లు, ఏ బ్యాంకు వడ్డీ ఎంత ఉంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News