Twitter CEO Jack Dorsey: సీఈఓ జాక్ డోర్సీ నుంచి CTO Parag Agrawal కి సీఈఓ బాధ్యతలు

Twitter New CEO Parag Agrawal: ట్విటర్ సీఈఓ జాక్ డోర్సీ ఆ పదవి నుంచి దిగిపోనున్నారు. జాక్ డోర్సీ స్థానంలో ట్విటర్ సీటీఓ పరాగ్ అగర్వాల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. తక్షణమే ఈ మార్పు అమలులోకి వస్తుందని ట్విటర్ స్పష్టంచేసింది. సీటీఓ పరాగ్ అగర్వాల్‌కి సీఈఓ బాధ్యతలు అప్పగించడంతో పాటు ట్విటర్ బోర్డు సభ్యుల్లో ఒకరిగా అవకాశం అందుకోనున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2021, 11:42 PM IST
  • ప్రస్తుత సీఈఓ జాక్ డోర్సీని పక్కకు పెట్టిన ట్విటర్
  • ట్విటర్‌కు కొత్త సీఈఓగా CTO Parag Agrawal కి బాధ్యతలు
  • Jack Dorsey పై ఎలియట్ మేనేజ్‌మెంట్ కార్ప్ ఆరోపణలు
Twitter CEO Jack Dorsey: సీఈఓ జాక్ డోర్సీ నుంచి CTO Parag Agrawal కి సీఈఓ బాధ్యతలు

Twitter New CEO Parag Agrawal: ట్విటర్ సీఈఓ జాక్ డోర్సీ ఆ పదవి నుంచి దిగిపోనున్నారు. జాక్ డోర్సీ స్థానంలో ట్విటర్ సీటీఓ పరాగ్ అగర్వాల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. తక్షణమే ఈ మార్పు అమలులోకి వస్తుందని ట్విటర్ స్పష్టంచేసింది. సీటీఓ పరాగ్ అగర్వాల్‌కి సీఈఓ బాధ్యతలు అప్పగించడంతో పాటు ట్విటర్ బోర్డు సభ్యుల్లో ఒకరిగా అవకాశం అందుకోనున్నారు. 

నవంబర్ 28న చివరిసారిగా ట్వీట్ చేసిన జాక్ డోర్సీ.. ''ఐ లవ్ ట్విటర్'' అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. జాక్ డోర్సీ చేసిన ఈ ట్వీట్‌కి (Twitter CEO Jack Dorsey) 56,600 కంటే అధికంగా లైక్స్ వచ్చిపడ్డాయి. 

ఇదిలావుంటే, సోమవారం నాటి ఎర్లీ ట్రేడింగ్‌లో ట్విటర్ కంపెనీ షేర్స్ (Twitter shares) 9 శాతం పైకి ఎగబాకాయి. అలాగే జాక్ డోర్సీ నేతృత్వంలోని డిజిటల్ పేమెంట్స్ ఫర్మ్ స్వ్కేర్ కంపెనీ షేర్స్ గ్రాఫ్‌లో సైతం 3 శాతం పెరుగుల నమోదైంది.

Also read : Job creation: సెప్టెంబర్​లో పెరిగిన ఉద్యోగాలు- కొత్తగా 15.4 లక్షల మందికి ఉపాధి!

గత సంవత్సరం ఆరంభంలోనే జాక్ డోర్సీని ఆ స్థానం నుంచి దిగిపోవాల్సిందిగా ఎలియట్ మేనేజ్‌మెంట్ కార్ప్ సూచించింది. జాక్ డోర్సీ స్క్వేర్ కంపెనీ వ్యవహారాలు చూసుకుంటూ ట్విటర్ సంస్థ అభివృద్ధిపై దృష్టి సారించడంలో విఫలం అవుతున్నారని ఎలియట్ మేనేజ్‌మెంట్ కార్ప్ ఆరోపించింది. ఆ తర్వాత దాదాపు రెండేళ్లకు అంతిమంగా జాక్ డోర్సీ ట్విటర్ సీఈఓ స్థానం (Twitter latest news updates) నుంచి దిగిపోతుండటం గమనార్హం. ట్విటర్ తీసుకున్న ఈ నిర్ణయంతో జాక్ డోర్సీ పేరుతో పాటు సీటీఓ పరాగ్ అగర్వాల్ (CTO Parag Agrawal) పేరు కూడా వార్తల్లో నిలిచింది.

Also read : Reliance Capital: అనిల్​ అంబానీకి మరోషాక్​- రిలయన్స్ క్యాపిటల్ బోర్డు రద్దు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News