Trai Guidelines: దేశంలో టెలికాం కంపెనీలను పర్యవేక్షించడం, నియంత్రించడం చేసేది ట్రాయ్. ట్రాయ్ ఇప్పుడు వినియోగదారుల ప్రయోజనార్దం కొత్త నిర్ణయం తీసుకుంది. ట్రాయ్ కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది.
దేశంలో చాలా రకాల టెలీకాం కంపెనీలు సేవలందిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో టారిఫ్ కూడా పెరిగిపోయింది. దేశంలోని టెలీకం కంపెనీలు, వినియోగదారులకు మధ్య వారధిగా ఉంటూ..టెలీకాం కంపెనీలను పర్యవేక్షించడం, నియంత్రించడం ఈ సంస్థ పని. టెలీకాం కంపెనీల వివాదాలు కూడా ట్రాయ్ పరిష్కరిస్తుంటుంది. ఇప్పుడు వినియోగదారులకు ట్రాయ్ గుడ్‌న్యూస్ అందించింది. ట్రాయ్ కొత్త నిర్ణయం మొబైల్ ఫోన్ వినియోగదారులకు ఊరట కల్గిస్తోంది.
దేశంలో అందుబాటులో ఉన్న టెలీకాం కంపెనీల (Telecom Companies) టారిఫ్ ఇంచుమించు ఒకేలా ఉంటుంది. ఇక వ్యాలిడిటీ విషయంలో నెల అంటే 30 రోజుల వ్యవధి ఏ కంపెనీకు లేదు. అన్ని కంపెనీలు 24 రోజులు లేదా 28 రోజుల వ్యవధితో టారిఫ్ అందిస్తున్నాయి. ఈ క్రమంలో టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్రాయ్ జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం వినియోగదారులకు కచ్చితంగా 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ అందించాల్సి ఉంటుంది. ఇక నుంచి వివిధ ప్లాన్స్ తో పాటు 30 రోజుల కాల వ్యవధితో కూడా ఒక ప్లాన్ ఉంటుంది. ఇప్పటి వరకూ ఈ పరిస్థితి లేదు. 28 రోజుల కాలవ్యవధితోనే ఆఫర్లు అందిస్తున్నాయి. మూడు నెలలంటే 90 రోజులు కాకుండా..84 రోజులే ఇస్తున్నాయి. ఇక నుంచి 30 రోజుల ప్లాన్ ఒకటి అందుబాటులో ఉండాలి. 30 రోజుల ప్లాన్స్( 30 Days Validity Plans)ఇవ్వడం లేదంటూ ట్రాయ్‌కు వినియోగదారుల్నించి చాలా ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై స్పందించిన ట్రాయ్ ఈ కొత్త గైడ్‌లైన్స్ (Trai New Guidelines) జారీ చేసింది.
Also read: Todays Gold Rate: పసిడి ప్రియులకు శుభవార్త, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook