Toyota Urban Cruiser Hyryder CNG: టయోటా నుంచి సూపర్ ఎస్‌యూవి కారు.. క్రెటా, గ్రాండ్ వితారా పరిస్థితి ఏంటి ?

Toyota Urban Cruiser Hyryder CNG Price, Mileage: అర్బన్ క్రూయిజర్ హైరైడర్ G వేరియంట్ పూర్తి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్ సిస్టం వంటి ఫీచర్స్ కస్టమర్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. సేఫ్టీ కోసం సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2023, 10:39 PM IST
Toyota Urban Cruiser Hyryder CNG: టయోటా నుంచి సూపర్ ఎస్‌యూవి కారు.. క్రెటా, గ్రాండ్ వితారా పరిస్థితి ఏంటి ?

Toyota Urban Cruiser Hyryder CNG Price, Mileage: టయోటా నుంచి మిడ్-సైజ్ ఎస్‌యువి సెగ్మెంట్‌లో మొట్టమొదటి సిఎన్‌జి కారును లాంచ్ చేసింది. గతేడాది నవంబర్ నెలలోనే సీఎన్జీ కేటగిరీలోకి ప్రవేశించిన టయోటా కంపెనీ.. తాజాగా టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ సిఎన్‌జి ధరను వెల్లడించింది. సీఎన్జీలో లాంచ్ అయిన టయోటా హైరైడర్ రెండు వేరియంట్‌లలో G, S అనే రెండు వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ సిఎన్‌జి బేసిక్ వేరియంట్ ధర 13 లక్షల రూపాయలుగా ఉంది. ఫీచర్స్, తక్కువ ధర కారణంగా టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ సిఎన్‌జి కారు హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి కార్ల అమ్మకాలపై ప్రభావం చూపిస్తుందని ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఏయే వేరియంట్ ధర ఎంత ఉందంటే..
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ సీఎన్జీ రెండు వేరియంట్‌లలోనూ కేవలం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ గేర్ సిస్టంతో విడుదలైంది. అందులో S వేరియంట్ ధర రూ. 13,23,000 గా ఉండగా G వేరియంట్ ధర రూ. 15,29,000 గా ఉంది.

సీఎన్జీలో ఎట్రాక్టివ్ మైలేజ్..
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ గతేడాది జూలై నెలలోనే లాంచ్ కాగా సాధారణ పెట్రోల్ ఇంజన్ వెర్షన్ లోనే అందుబాటులోకి వచ్చింది. కస్టమర్ల నుండి టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కారుకు భారీ స్పందన కనిపించింది. అర్బన్ క్రూయిజర్ హైరైడర్ సీఎన్జీ వెర్షన్ 1.5-లీటర్ K-సిరీస్ ఇంజన్‌ ఆధారంగా తయారైన ఈ ఎస్‌యూవీ కారు 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ గేర్ సిస్టం అమర్చారు. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ సిఎన్‌జి ఎస్‌యూవి కారు ఒక కిలోకు 26.6 కి.మీ మైలేజీని ఇస్తుందని టయోటా కంపెనీ చెబుతోంది.

ఆకట్టుకుంటున్న ఫీచర్స్
అర్బన్ క్రూయిజర్ హైరైడర్ G వేరియంట్ పూర్తి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్ సిస్టం వంటి ఫీచర్స్ కస్టమర్స్ ని ఆకట్టుకుంటున్నాయి. సేఫ్టీ కోసం సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. మారుతి గ్రాండ్ వితారా సీఎన్జీ వెర్షన్ ధర రూ.12.85 లక్షలు కాగా టయోటా హైరైడర్ సీఎన్జీ కారు గ్రాండ్ వితారా కంటే రూ. 38,000 మాత్రమే ఎక్కువ. ఎస్ యువి కార్ల సెగ్మెంట్ లో టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ సిఎన్‌జి కారు మారుతి గ్రాండ్ వితారా, హ్యూందాయ్ క్రెటా కార్లకు గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ సిఎన్‌జి రాకతో ఈ రెండు రకాల కార్ల అమ్మకాలు ఏ మేరకు ప్రభావితం కానున్నాయో వేచిచూడాల్సిందే మరి.

ఇది కూడా చదవండి : Big Discount On iPhone: ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్.. రూ. 25 వేల భారీ తగ్గింపు

ఇది కూడా చదవండి : Mahindra XUV400 EV: మహింద్రా నుంచి మరో కొత్త బాహుబలి.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే 456 కిమీ రేంజ్

ఇది కూడా చదవండి : kia EV9 Specs: కొత్త కారు కొంటున్నారా ? కొంచెం ఆగండి

ఇది కూడా చదవండి : Tata Nexon SUV Prices: మారుతి, మహింద్రాలకు చమటలు పట్టిస్తున్న ఎస్‌యూవి.. జనం కళ్లు మూసుకుని కొంటున్న ఎస్‌యూవి కారు ఏదో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News