Toyota Upcoming Cars In India 2023: జపాన్ కు చెందిన ఆటోమొబైల్ తయారీ కంపెనీ టయోటా రానున్న 12 నెలలో భారత మార్కెట్లో ఐదు కార్లను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ కార్లు అధునాతన ఫీచర్స్ తో కస్టమర్లకు లభించబోతున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పటికే భారత మార్కెట్లో విడుదల చేసిన ఇన్నోవా, ఫార్చునర్ SUVలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో.. దీనిని దృష్టిలో పెట్టుకొని కంపెనీ ఈ ఐదు కార్లను విడుదల చేయబోతున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా టయోటా మారుతి సుజుకి భాగస్వామ్యంతో రాబోయే రోజుల్లో మరికొన్ని కార్లను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఏడాదిలో టయోటా మార్కెట్లోకి విడుదల చేసే కార్లు ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
టయోటా SUV కూపే:
టయోటా నుంచి మార్కెట్లోకి విడుదలయ్యే కార్లలో మొదటగా టయోటా SUV కూపే విడుదల కాబోతోంది. ఈ కారును యారిస్ క్రాస్ డిజైన్ ను అనుసరించి తయారు చేసినట్లు సమాచారం. అంతే కాకుండా దీని ముందు భాగం మారుతి సుజుకి విడుదల చేసిన కార్లను పోలి ఉంటుంది. ఇక ఇంజన్ విషయానికొస్తే.. భారత మార్కెట్లో ఈ కారు విడుదలయితే 1.2L ఇంజన్ తో అందుబాటులోకి వస్తుంది. అధునాతన టెక్నాలజీతో ఈ కారును తయారు చేయడం వల్ల చాలా రకాలు కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.
Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్
7 సీటర్ టయోటా కరోలా క్రాస్:
వచ్చే సంవత్సరంలోని రెండవ నెలలో 7 సీటర్ టయోటా కరోలా క్రాస్ విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇది ఇన్నోవా హైక్రాస్ ను పోలి ఉంటుందని సమాచారం. ఇంతవరకు ఏ కారులో చూడని హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ తో మార్కెట్లోకి రాబోతోంది. అంతేకాకుండా కంఫర్టబుల్ సీటింగ్ కెపాసిటీతో ఉండబోతోంది.
నెక్స్ట్-జెన్ టయోటా ఫార్చ్యూనర్ :
భారత మార్కెట్లో టయోటా ఫార్చునర్ కు ఉన్న క్రేజ్ ఇంకే కారుకు లేదు. రాజకీయ నాయకుల నుంచి మొదలుకొని బిజినెస్ మాన్ ల దాకా ప్రతి ఒక్కరూ ఈ కార్లను వినియోగిస్తూ ఉంటారు. అయితే టయోటా నెక్స్ట్ జనరేషన్ పేరుతో ఫార్చునర్ ని అప్డేట్ చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది. కాకుండా బాడీలో చిన్న చిన్న మార్పులు చేసి కొత్త ఫీచర్లతో వచ్చే ఏడాదిలో ఈ కారును రీ లాంచ్ చేయబోతున్నట్లు కూడా సమాచారం.
Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి