Todays Gold Rate: దేశంలో ఇవాళ మార్చ్ 20, 2022 వివిధ నగరాల్లో బంగారం ధరలు

Todays Gold Rate: బంగారం ధర స్వల్పంగా తగ్గింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో గత కొద్దిరోజలుగా బంగారం ధర భారీగా పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 20, 2022, 06:49 AM IST
Todays Gold Rate: దేశంలో ఇవాళ మార్చ్ 20, 2022 వివిధ నగరాల్లో బంగారం ధరలు

Todays Gold Rate: బంగారం ధర స్వల్పంగా తగ్గింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో గత కొద్దిరోజలుగా బంగారం ధర భారీగా పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, డాలర్ విలువ, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో బంగారం ధర గత కొద్దిరోజులుగా పరుగులు పెడుతూనే ఉంది. బంగారం ధర విపరీతంగా పెరిగింది. ఇప్పుడు తొలిసారిగా ఇవాళ స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. 150 రూపాయల నుంచి 170 రూపాయలవరకూ తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇవాళ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 3 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 6 వందలుంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 6 వందలుంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 48 వేల 50 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 52 వేల 420 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 3 వందలైతే.. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 6 వందలుంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 3 వందలుంది. ఇక 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 6 వందలుగా ఉంది. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 3 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51 వేల 6 వందలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల 47 వేల 3 వందలుంది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 6 వందలుంది. అటు విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. 

Also read: Amazon Mobile Savings Days: అమెజాన్ మొబైల్ సేవింగ్స్..ఇవాళే చివరిరోజు, ఆ ఫోన్ కేవలం 549 రూపాయలు మాత్రమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News