Gold Price Today: కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర..

Gold Price Today: కొనుగోలుదారులకు శుభవార్త. పసిడి ధరలు ఎట్టకేలకు తగ్గాయి. ఇవాళ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 11, 2022, 07:02 AM IST
Gold Price Today: కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర..

Gold Price Today: గత కొన్ని రోజులుగా కొనుగోలుదారులకు పసిడి ధరలు షాకిస్తూనే ఉన్నాయి. పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గాయి. బులియన్ మార్కెట్లో ఇవాళ స్వల్పంగా గోల్డ్ ధరలు నమోదయ్యాయి. మన దేశంలో పేద, మధ్యతరగతికి చెందిన ప్రజలు భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు బంగారం ఉపయోగపడుతుందని..  రేటు తగ్గినప్పుడల్లా పసిడిని కొనుగోలు చేస్తూ ఉంటారు. డబ్బున్న వారు మార్కెట్లో ఏవైనా కొత్ మోడల్స్ వస్తే వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. తాజాగా ధరలు స్వల్పంగా తగ్గిన నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం. ఈ రేట్స్ ఉదయం 6 గంటలకు నమోదైనవని గుర్తించుకోండి. 

దేశంలోని ప్రధాన నగరాల్లో...
>> ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47, 750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100 వద్ద ఉంది.
>> ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51, 930 వద్ద కొనసాగుతోంది.
>> చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.48,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,420గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు:
>> హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,930 వద్ద కొనసాగుతోంది.
>> విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర .47,600గా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930గా ఉంది.
>>విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర .47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 వద్ద కొనసాగుతోంది.

Also Read: Share Market: ఈ రంగాల్లో పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించే అవకాశం, మార్కెట్ నిపుణుల సూచన ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3P3R74U 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News