Sustainability Summit 2023: 2070 నాటికి నికర జీరో ఉద్గార లక్ష్యాన్ని సాధించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే టై ఢిల్లీ-ఎన్సీఆర్ ఇటీవల సుస్థిరత, పర్యావరణ స్పృహ పద్ధతులను ప్రోత్సహించడానికి సస్టైనబిలిటీ సమ్మిట్‌ను భారీగా నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు స్టార్టప్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, ఇతర కీలక వాటాదారులను చర్చల్లో పాల్గొనేందుకు హాజయర్యారు. స్థిరమైన భవిష్యత్‌ను పెంపొందించే లక్ష్యంతో వినూత్న పరిష్కారాలను అన్వేషించడంపై చర్చించారు.
జొమాటో చీఫ్ సస్టైనబిలిటీ ఆఫీసర్ అంజల్లి కుమార్ మాట్లాడుతూ.. ఎక్కువ మందికి మంచి ఆహారమే జొమాటో లక్ష్యమని తెలిపారు. తాము 2033 నాటికి నికర జీరో కంపెనీగా మారడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. తాము 100 శాతం ఎలక్ట్రిక్ వెహికల్ ఆధారిత డెలివరీలకు కట్టుబడి ఉన్నామని.. ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరులో 1/5 వంతు డెలివరీలు ఎలక్ట్రిక్ వాహనాల ఆధారంగానే జరుగుతున్నాయన్నారు. ఎలక్రిక్ట్ వెహికల్ భాగస్వామ్యం వేగంగా పెంచుతున్నామని.. ప్రస్తుతం 26 వేల ఈవీ ఆధారిత డెలివరీ భాగస్వాములు ఉన్నాయన్నారు. అన్నీ టై ఢిల్లీ-ఎన్సీఆర్ వంటి నెట్‌వర్క్‌ల నుంచి పుట్టిన స్టార్ట్-అప్ల ద్వారా సులభతరం అయ్యాయని చెప్పారు. తమ స్థిరత్వ లక్ష్యాలను సాధించడంలో సహాయపడిన స్టార్టప్ ఆర్థిక వ్యవస్థకు కృతజ్ఞతలు తెలిపారు.
సుస్థిరత రంగానికి గణనీయమైన కృషి చేస్తున్న స్టార్టప్‌లను గుర్తించేందుకు టై ఢిల్లీ ఎన్సీఆర్ సమ్మిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆహారం-నీటి ఆవిష్కరణలు, స్థిరమైన తయారీ-పరిసరాలు, చలనశీలత పరిష్కారాలు, మరిన్నింటితో సహా స్థిరత్వానికి సంబంధించి వివిధ అంశాలపై లోతుగా చర్చించారు. పర్యావరణ బాధ్యతతో వ్యాపార విజయాన్ని సమన్వయం చేయడం.. కొత్త అవకాశాలు, వ్యాపార అవకాశాలను సృష్టించే లక్ష్యం దిశగా సమ్మిట్ సాగింది.
లుఫ్తాన్స గ్రూప్‌లోని సేల్స్-సౌత్ ఏషియా జనరల్ మేనేజర్ సంగీతా శర్మ మాట్లాడుతూ.. 2050 నాటికి CO2 తటస్థతను సాధించాలనే లక్ష్యంతో స్థిరత్వం కోసం తాము అంకిత భావంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. సుస్థిర విమాన ఇంధనం (SAF)లో లుఫ్తాన్స గ్రూప్ భారీగా పెట్టుబడి పెట్టిందని.. అత్యాధునిక విమానాల కొనుగోలును చేసిందని చెప్పుకొచ్చారు.
"సుస్థిరత అనేది మన డీఎన్‌లో ఉంది. మేము 2050 నాటికి CO2 తటస్థంగా ఉండటానికి కట్టుబడి ఉన్నాము. రాబోయే సంవత్సరాల్లో స్థిరమైన విమాన ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి పెట్టుబడి పెట్టాము. లుఫ్తాన్స గ్రూప్ ప్రపంచంలో స్థిరమైన విమాన ఇంధనాన్ని కొనుగోలు చేసే టాప్ 5 కస్టమర్లలో ఒకటి. ప్రతి విమానంలో 30 శాతం ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడే 200 అత్యాధునిక విమానాలను కొనుగోలు చేయడానికి భారీగా ఖర్చు చేశాం." అని సంగీత శర్మ తెలిపారు.
సుస్థిరత ప్రక్రియను వేగవంతం చేసే మార్గాలను పరిశీలించడానికి ఇది తమకు అద్భుతమైన అవకాశం అని ఐసీఎఫ్ మాజీ ఛైర్మన్, సీఈఈ సుధాకర్ కేశవన్ తెలిపారు. తాము ప్రతి స్థాయిలో సుస్థిరతను బోధించడానికి సంస్థాగత యంత్రాంగాలను అభివృద్ధి చేయాలని అన్నారు.
టై ఢిల్లీ ఎన్సీఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతికా దయాల్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల ప్రపంచ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని.. పర్యావరణ అనుకూలమైన, స్థిరమైన పద్ధతులు అత్యంత ముఖ్యమైనవిగా మారాయని చెప్పుకొచ్చారు. పేపర్ వినియోగాన్ని తగ్గించడం.. ప్లాస్టిక్ బాటిళ్లను తొలగించడం వంటి చర్యలను చేపట్టినట్లు వివరించారు. సస్టైనబిలిటీ సమ్మిట్ పచ్చదనం, మరింత సమర్థవంతమైన భవిష్యత్తుకు దోహదపడే స్టార్టప్‌ల మధ్య ఆవిష్కరణలను పెంపొందించడానికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి : Rain Alert: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన, ఎండలు-ఉక్కపోత నుంచి ఉపశమనం
ఇది కూడా చదవండి : Israel Hamas War: హమాస్ ఉగ్రవాదులను ఏరివేతకు ఇజ్రాయెల్ సైన్యం విశ్వప్రయత్నాలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..