/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Tata Punch Offers: భారత కార్ల తయారీ టాప్‌ కంపెనీల్లో టాటా మోటర్స్‌ ఒకటి. ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా ఎంత ప్రజాదరణ ఉందో అందరికీ తెలిసిందే. అయితే పాపులారిటీని మరింత పెంచుకోవడానికి టాటా పంచ్ ఎస్‌యూవీని మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. టాటా అనుకున్నట్లే ఈ కారుతో మార్కెట్‌లో మరింత పేరు సంపాదించింది. ఈ టాటా పంచ్‌ ప్రీమియం ఫీచర్స్‌తో బడ్జెట్‌లో లభించడం వల్ల ఒక్కసారిగా విక్రయాలు ఊపందుకున్నాయి. దీని కారణంగా కంపెనీ మరికొన్ని మోడల్స్‌ను మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. అయితే మార్కెట్‌లో దీనికి రోజురోజు డిమాండ్‌ పెరగడంతో EV వేరియంట్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే చాలా మందికి  పంచ్  10 వేరియంట్లపై అందుబాటులో ఉన్న ఆఫర్స్‌ వివరాలు తెలియవు. అయితే ఈ కారు కొనుగోలు చేయాలనుకునేవారి కోసం ప్రత్యేకమై ఆఫర్స్‌ వివరాలను అందించబోతున్నాం. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

టాటా పంచ్‌పై ఆఫర్లు:
1. ఎక్స్ఛేంజ్ బోనస్: 

ప్రస్తుతం కొన్ని టాటా మోటార్స్ స్టోర్స్‌లో ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి పాత కారును టాటా పంచ్‌తో మార్చుకునే వారికి రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా మరింత బోనస్‌ కూడా లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీని కోసం టాటా మోటార్స్ డీలర్‌షిప్‌ సంప్రదించాల్సి ఉంటుంది.

2. కార్పొరేట్ డిస్కౌంట్: 
ప్రస్తుతం టాటా కంపెనీ తమ కార్లపై కార్పొరేట్ ఉద్యోగులకు కూడా ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను అందిస్తోంది. కార్పొరేట్‌లో పని చేసేవారు టాటా పంచ్‌ను కొనుగోలు చేస్తే ప్రత్యేకమైన డిస్కౌంట్‌ లభిస్తుంది. అంతేకాకుండా ఇతర డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది.  

3. లాయల్టీ బోనస్: 
ఇప్పటికే టాటా మోటార్స్ వాహనం కలిగి ఉన్న కస్టమర్లకు రూ.5,000 రకు లాయల్టీ బోనస్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్‌ అనేది కేవలం టాటా ప్రకటించినప్పుడే అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ఆఫర్‌ వివరాలు తెలుసుకోవడానికి టాటా మోటార్స్ డీలర్‌షిప్‌ను సంప్రదించడం మంచిది. 

4. ఫైనాన్స్ ఆఫర్లు:
టాటా పంచ్‌ కొనుగోలు చేసేవారికి టాటా మోటార్స్ కొన్ని స్టోర్స్‌లో ప్రత్యేకమైన ఫైనాన్స్ ఆఫర్లను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌ సంబంధించిన పూర్తివివరాలను తెలుసుకోవడానికి  డీలర్‌షిప్‌ లేదా టాటా అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ను వినియోగించి రుణం తీసుకునే వారికి తక్కువ వడ్డీ రేట్లు లభిస్తాయి. 

5.ఎక్స్‌టెండెడ్ వారంటీ: 
టాటా పంచ్‌ కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన ఆఫర్స్‌లో భాగంగా ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా అందుబాటులో ఉంది. దీనిని కొనుగోలు చేసేవారికి 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా అందుబాటులో ఉంది. దీంతో పాటు కొన్ని చోట్ల టాటా పంచ్ యాక్సెసరీలపై డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

6. మెయింటెనెన్స్ ప్యాకేజీలు: 
టాటా పంచ్‌పై సర్వీస్ మెయింటెనెన్స్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల్లో రోడ్ టాక్స్‌పై చాలా డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు టాటా పంచ్‌పై తక్కువ బీమా ప్రీమియంలు కూడా లభిస్తున్నాయి. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Tata Punch Offers: Amazing Tata Punch Offers, Bonus Up To Rs.20,000 And Plus Loyalty Bonus Too Dh
News Source: 
Home Title: 

Tata Punch Offers: టాటా పంచ్‌పై అద్భుతమైన ఆఫర్స్‌.. రూ.20,000 వరకు బోనస్, అదనంగా లాయల్టీ బోనస్ కూడా..
 

Tata Punch Offers: టాటా పంచ్‌పై అద్భుతమైన ఆఫర్స్‌.. రూ.20,000 వరకు బోనస్, అదనంగా లాయల్టీ బోనస్ కూడా..
Caption: 
source file: zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
టాటా పంచ్‌పై అద్భుతమైన ఆఫర్స్‌.. రూ.20,000 వరకు బోనస్, అదనంగా లాయల్టీ బోనస్ కూడా..
Dharmaraju Dhurishetty
Publish Later: 
No
Publish At: 
Saturday, March 16, 2024 - 17:06
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
23
Is Breaking News: 
No
Word Count: 
366