Tata Neu Sale Parade 2023: టాటా న్యూ సేల్ పరేడ్ 2023.. తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్స్, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్స్, ఏసీలు

Tata Neu Sale Parade 2023: అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌కి పోటీగా తాజాగా టాటా కూడా ' టాటా న్యూ సేల్ పరేడ్ 2023 ' పేరుతో భారీ ఆఫర్స్ ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్, కిరాణా, ఫ్యాషన్, మెడిసిన్, ఫుట్‌వేర్.. ఇలా ఒకటేమిటి.. అన్నిరకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లను పొందాలనుకునే వారు టాటా న్యూ యాప్‌లో లేదా టాటా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఆర్డర్ చేస్తే... సరసమైన ధరలకే మీరు కోరుకున్న ప్రోడక్ట్స్ మీ ఇంటి తలుపు తడుతాయి.

Written by - Pavan | Last Updated : Aug 12, 2023, 12:04 AM IST
Tata Neu Sale Parade 2023: టాటా న్యూ సేల్ పరేడ్ 2023.. తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్స్, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్స్, ఏసీలు

Tata Neu Sale Parade 2023: టాటా గ్రూప్ డెవలప్ చేసిన టాటా న్యూ బోలెడన్ని ఆఫర్స్ గుప్పిస్తోంది. టాటా న్యూ సేల్ పరేడ్ 2023 పేరుతో ఆగస్టు 10 నుండి 13 తేదీల మధ్య ఆఫర్స్ టాటా న్యూలో జాతర జరుగుతోంది. టాటా సంస్థ పరిధిలోకి వచ్చే వాణిజ్య సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ విక్రయించే క్రోమా, ఆన్‌లైన్లో మెడిసిన్ విక్రయించే 1mg, ఫినాన్షియల్ సెక్టార్ రంగంలో రుణాలు మంజూరు చేసే టాటా క్యాపిటల్, ప్రతీ ఇంటికి అవసరమైన నిత్యావసరాల నుంచి ఇంటికి పనికొచ్చే అన్ని ఉత్పత్తులను సమకూర్చే బిగ్ బాస్కెట్, ఆన్‌లైన్ ఫుట్‌వేర్ స్టోర్ టాటా క్లిక్, ఇవే కాకుండా మరెన్నో ఫ్యాషన్ బ్రాండ్స్‌కి ఇతర ఉత్పత్తులకు మీడియేటర్‌గా వ్యవహరిస్తున్న టాటా డిజిటల్ ప్లాట్‌ఫామ్.. ఇలా చెప్పుకుంటూ పోతే టాటా పరిధిలోకి వచ్చే సంస్థల జాబితా పెద్దదే. ఆ సంస్థలన్నింటిని ఒక్కచోటికి చేర్చేదే ఈ టాటా న్యూ.

అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌కి పోటీగా తాజాగా టాటా కూడా ' టాటా న్యూ సేల్ పరేడ్ 2023 ' పేరుతో భారీ ఆఫర్స్ ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్, కిరాణా, ఫ్యాషన్, మెడిసిన్, ఫుట్‌వేర్.. ఇలా ఒకటేమిటి.. అన్నిరకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లను పొందాలనుకునే వారు టాటా న్యూ యాప్‌లో లేదా టాటా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఆర్డర్ చేస్తే... సరసమైన ధరలకే మీరు కోరుకున్న ప్రోడక్ట్స్ మీ ఇంటి తలుపు తడుతాయని టాటా న్యూ చెబుతోంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ పై 40 శాతం డిస్కౌంట్, ఫుట్‌వేర్‌పై 75 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఐఫోన్ ప్రేమికుల కోసం యాపిల్ ఐఫోన్ 13 కూడా ఈ ఆఫర్ల జాబితాలో ఉంది. యాపిల్ ఐఫోన్ 13 లో 128GB స్టోరేజ్ వేరియంట్‌తో పాటు , 256GB వేరియంట్ ఫోన్ కూడా అందుబాటులో ఉంది. 

టాటా న్యూలో యాపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్
యాపిల్ ఐఫోన్ 13 అసలు ధర రూ. 69,900 కాగా ఈ ఫోన్‌పై టాటా న్యూలో 13.9% డిస్కౌంట్ లభిస్తోంది. అంటే డిస్కౌంట్ తరువాత రూ. 60750 లభిస్తుంది. ఇదే కాకుండా, ఒకవేళ మీరు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్ అయ్యుంటే.. ఆ క్రెడిట్ కార్డుపై అదనంగా మరో రూ. 2000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. టాటా సంస్థకే చెందిన క్రోమా డిజిటల్ ద్వారా స్మార్ట్ ఫోన్స్ పై ఈ రకమైన డిస్కౌంట్ డీల్స్ లభిస్తున్నాయి. ఇలాంటి టెంప్టింగ్ ఆఫర్స్ మరెన్నో టాటా న్యూ యాప్‌లో మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. మరిన్ని ఇతర ఆఫర్స్ వివరాల కోసం టాటా న్యూలోకి లాగిన్ అవ్వాల్సిందే.

ఇది కూడా చదవండి : Fuel Credit Cards Benefits: అసలు ఫ్యూయెల్ క్రెడిట్ కార్డులతో లాభం ఉంటుందా ?

ఆగస్టు 15 2023 సందర్భంగా అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ స్టోర్స్ భారీ ఆఫర్స్ అందిస్తున్న నేపథ్యంలో టాటా కంపెనీ కూడా తమ తమ కస్టమర్స్ కోసం ఈ ఆఫర్స్ అందిస్తోంది. అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ స్టోర్స్‌లో ఆయా ఉత్పత్తులు విక్రయించే వెండార్స్ బయటి వారు కాగా.. టాటా న్యూలో మాత్రం అవి విక్రయించే సంస్థలు కూడా టాటా గ్రూప్ పరిధిలోకే వచ్చేవి కావడం గమనార్హం.

ఇది కూడా చదవండి : Peon To Richest Man Success Story: ఒకప్పుడు ప్యూన్.. ఇప్పుడు 88 వేల కోట్లకు అధిపతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News