Stocks today: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నప్పటికీ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో నష్టాల నుంచి తేరుకున్నాయి. వారాంతపు సెషన్లో బీఎస్ఈ- సెన్సెక్స్ 1329 పాయింట్లు పెరిగి.. 55,858 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ 410 పాయింట్లు పుంజకుని 16,658 స్థిరపడింది.
యుద్ధ భయాలు ఉన్నా...
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుధ్దం రెండో రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా బాంబుదాడులు చేస్తోంది. ఉక్రెయిన్ కూడా రష్యా చర్యలకు బదులిస్తోంది. నిన్నటితో పోలిస్తే.. యుద్ధ భయాలు పెరిగినా.. స్టాక్ మార్కెట్లు మాత్రం భారీగా పుంజుకున్నాయి. ఇందుకు నిపుణులు చెబుతున్న కారణాలు ఏమిటంటే.. రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా సహా బ్రిటన్, జర్మనీ వంటి దేశాలు ఆంక్షలు కఠినతరం చేస్తున్నాయి. ఈ నేపఫథ్యంలో రష్యా కాస్త వెనక్కి తగ్గొచ్చని అంచనాలు ఉన్నాయి. దీనితో స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
అన్ని రంగాలు నేడు లాభాలను గడించాయి. ముఖ్యంగా లోహ, బ్యాంకింగ్, టెక్ కంపెనీలు భారీగా పుంజుకున్నాయి.
ఈ రోజు సెషన్ గరిష్ఠ, కనిష్ఠ స్థాయిలు ఇవే..
ఇంట్రాడేలో సెన్సెక్స్ 56,183 పాయింట్ల అత్యధిక స్థాయిని నమోదు చేసింది. ఇది నేటి ఓపెనింగ్ కన్నా తక్కువ. మిడ్ సెషన్లో నమోదైన అమ్మకాల కారణఁగా 55,299 వద్దకు పడిపోయింది.
నిఫ్టీ అత్యధికంగా 16,748 పాయింట్ల స్థాయిని తాకింది. ఓ దశలో 17 వేల మార్క్ కోల్పోయి.. 16,478 వద్దకు చేరింది.
నేటి సెషన్లో టాప్-5 షేర్లు..
30 షేర్ల ఇండెక్స్‌లో 29 షేర్లు లాభాలను ఒక కంపెనీ మాత్రమే స్వల్ప నష్టాలను మూటగట్టుకుంది.
టాటా స్టీల్ 6.33 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 5.87 శాతం, బజాజ్ ఫినాన్స్ 5.16 శాతం, ఎన్టీపీసీ 4.71 శాతం, టెక్ మహీంద్రా 4.37 శాతం లాభాలను గడగించాయి.
నెస్లే మాత్రం 0.25 శాతం నష్టపోయింది.
Also read: BSNL Cheapest Plan: BSNL చీపెస్ట్ రీఛార్జ్.. రూ.106 రీఛార్జ్ తో 84 రోజుల వ్యాలిడిటీ!
Also read: Bank holidays 2022 March: మార్చిలో 13 రోజులు బ్యాంక్ సెలవులు- మరిన్ని వివరాలు ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook