Spam Calls in India: స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్! త్వరలోనే అందుబాటులో..!

Spam Calls in India: మీరు రోజంతా స్పామ్ కాల్‌లతో విసిగిపోయారా? మీ సమాధానం అవును అయితే, మీరు ఈ సమస్యను ఉచితంగా, ఏ యాప్ సహాయం లేకుండానే వదిలించుకునే అవకాశం ఉంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 21, 2022, 02:09 PM IST
Spam Calls in India: స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్! త్వరలోనే అందుబాటులో..!

Spam Calls in India: మీ మొబైల్ లో కొన్ని స్పామ్ కాల్స్ వస్తున్నాయా? అయితే అలాంటి నంబర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో.. ఆ నంబరు గల వాళ్ల పేర్లు ఏంటో తెలుసుకునేందుకు ఓ యాప్ ఉంది. కానీ, ఇప్పుడు ఎలాంటి యాప్ సహాయం లేకుండానే మీకు ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. అవును, రాబోయే రోజుల్లో ఈ సదుపాయాన్ని టెలికాం వినియోగదారులకు అందించేందుకు TRAI ఆలోచిస్తోంది. దీని గురించి వివరాలను తెలుసుకుందాం. 

స్పామ్ కాల్‌లపై TRAI సన్నాహాలు..

దేశంలోని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరికీ స్పామ్ కాల్‌లను నివారించడంలో సహాయపడటానికి TRAI ఒక ఫీచర్‌పై పనిచేస్తోందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అధికారి ఒకరు తెలిపారు. మీ మొబైల్ స్క్రీన్‌పై ఎవరు కాల్ చేస్తున్నారో కనిపించే విధంగా సర్వీస్ ప్రొవైడర్లను అనుమతించే వ్యవస్థను రూపొందించాలని TRAI చూస్తోందని ఆ అధికారి తెలిపారు.

స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల KYC వివరాల ఆధారంగా TRAI వ్యవస్థ పని చేస్తుందని TRAI అధికారి తెలిపారు. ఈ కొత్త కాలర్ ID ఫీచర్ యూజర్ అనుమతిపై పని చేస్తుందని తెలుస్తోంది. ఇది టెలికాం కంపెనీల చందాదారులను వారి పేర్లను ప్రదర్శించాలా వద్దా అని ఎంచుకోవడానికి కూడా వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌పై చర్చలు జరుగుతున్నాయి. ఒకసారి ఈ సిస్టమ్ అమలు చేయబడితే, మీకు ట్రూ కాలర్ వంటి యాప్ అవసరం ఉండదు.

Also Read: Redmi 10 Flipkart: ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.749 ధరకే Redmi స్మార్ట్ ఫోన్!

Also Read: Flipkart Sale: రేపటి నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ బచత్ సేల్.. అనేక వస్తువులపై భారీ డిస్కౌంట్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News