Elon Musk Several Changes in Twitter App: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ అయిన ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఎలన్ మస్క్ ట్వీట్టర్ యాప్ లో భారీ మార్పులకు సిద్ధం అవుతున్నారు. ఎలన్ మస్క్ రాకతో అన్నింటి కంటే ముందుగా ఇప్పటి వరకు పబ్లిక్ ఇష్యూలో ఉన్న ట్విట్టర్ ఒక్కరిగా ప్రైవేటు కంపెనీగా రూపాంతరం చెందింది. టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల అధినేతగా తనకు ఉన్న అనుభవంతో ట్విటర్‌కు కొత్త హంగులు అద్దేందుకు ఎలన్ మస్క్ ప్రయత్నిస్తున్నారు. ట్విట్టర్‌ను త్వరలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచేందుకు సిద్ధం అవుతున్నారు.
ట్విటర్లో వాక్ స్వాతంత్రానికి ప్రధాన్యత ఇస్తానని ఈపాటికే ప్రకటించిన మస్క్ ఇందు కోసం ట్విటర్లో బ్లాగర్ల అభిప్రాయాలను సేకరించేందుకు ఓటింగ్ పెట్టాలని భావిస్తున్నారు. అయిత్ మస్క్ అభిప్రాయంతో పెద్ద మొత్తంలో నెటిజన్లు కూడా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో త్వరలో ఈ ఓటింగ్ ట్విట్టర్ తెరపైకి ప్రత్యక్షమయ్యే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఇప్పటి వరకు పలు కారణాలతో బ్లాక్ అయిన యూజర్లకు మళ్లీ ట్వీట్లు చేసే అవకాశం కల్పించనున్నారు.
16 ఏళ్ల క్రితం ట్విటర్ తన ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు ఒక ట్వీట్లో 71 నుంచి100 అక్షరాలకు మాత్రమే అనుమతి ఇచ్చేది. ఆతర్వాత దాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ పోయింది. ఇప్పుడు 208 అక్షరాలకు పెంచింది. దీంతో పెద్ద పోస్టులు చేసేవాళ్లు రెండుమూడు ట్వీట్లు చేయాల్సి వస్తోంది. ఈ వ్యవహారం ఎలాన్ మస్క్ రాకతో ఓ కొలిక్కిరానుంది.
‘కంటెంట్‌పై నియంత్రణ’ను ఎలన్ మస్క్ ఎత్తేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ట్విటర్ పెయిడ్ ఖాతాదారులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సంస్థ ఉద్యోగులు భావిస్తుండగా అందరికి సమ ప్రాధాన్యం ఇవ్వాలని మస్క్ భావిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై త్వరలో ఓ క్లారిటీ రానుంది.
మరోవైపు ఎలన్ మస్క్ రాకతో ‘క్విట్ ట్విటర్’ ఆన్లైన్ ఉద్యమం మొదలైంది. ఇన్నిరోజులు పబ్లిక్ కంపెనీగా ఉన్న ట్విటర్ ఇప్పుడు ఒక్కసారిగా ప్రైవేటుపరం కావడంతో చాలా మంది నిరాశకు గురయ్యారు. ఇకపై ప్రయివేట్ వ్యక్తుల గుత్తాధిపత్యం కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివాదాస్పద ట్వీట్లు పెట్టి అందర్ని ఇబ్బంది పెట్టిన వారిని మళ్లీ ట్వీట్టర్ లోకి ఆహ్వానించడంపై కూడా చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎలన్ మస్క్ రాకతో ట్విట్టర్ ఎన్నో మార్పులకు లోను అవుతోంది. సీరియస్ యూజర్లు ఇబ్బంది పడుతున్నా....ఏదో కాలక్షేపానికి ట్వీట్ చేస్తున్న వాళ్లు ఈ పరిణామాలు ఏవి పట్టించుకోవడం లేదు. ముందటి లాగే ట్వీట్లు పెట్టుకుంటూ పోతున్నారు.
Also Read: టెస్లై షేర్లు అమ్మేసిన ఎలన్ మస్క్
Also Read: Vodafone Idea Plan: వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ఆ ఫీచర్ ఇకపై అందుబాటులో ఉండదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook