Stock Market Closing: మూడో రోజూ స్టాక్ మార్కెట్లకు నష్టాలు- 60 వేల దిగువకు సెన్సెక్స్​

Stock Market News: స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 433 పాయింట్లు, నిఫ్టీ 143 పాయింట్లు కోల్పోయాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2021, 04:31 PM IST
  • స్టాక్ మార్కెట్లకు మూడో రోజూ నష్టాలు
  • ఆర్థిక, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి
  • దాదాపు 3 శాతం తగ్గిన ఎస్​బీఐ షేరు
Stock Market Closing: మూడో రోజూ స్టాక్ మార్కెట్లకు నష్టాలు- 60 వేల దిగువకు సెన్సెక్స్​

Stock Market Update: స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో (Stocks closing bell) ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ (BSE Sensex).. 433.13 పాయింట్లు కోల్పోయి.. 59,919 వద్ద స్థిరపడింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజి నిఫ్టీ (NSE Nify) 143 పాయింట్లు తగ్గి 17,873 వద్ద స్థిరపడింది.

ఆర్థిక(Finance Shares), ఐటీ షేర్లలో(IT Shares) అమ్మకాల ఒత్తిడి నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం భయాలు, జర్మనీ సహా పలు దేశాల్లో కరోనా కేసుల ఆందోళనలు కూడా మార్కెట్ల పతనానికి కారణమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు. స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగియటం ఇది వరుసగా మూడో సెషన్​.

ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..

ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్​ 60,293.25 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల ఒత్తిడితో ఒకానొక దశలో 59,656 కనష్ఠానికి పడిపోయింది.
నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,971.35 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,798.20 పాయింట్ల కనిష్ఠాన్ని తాకి.. చివరి దశలో కాస్త తేరుకుంది.

Also read: Vamika Rape Threat: కోహ్లీ కూతురును రేప్ చేస్తానని బెదిరించిన తెలుగు యువకుడు అరెస్ట్

Also read: Sajjanar : ప్రయాణికుడి ట్వీట్‌తో బస్‌ చార్జీలు తగ్గించిన సజ్జనార్‌

లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..

టైటాన్(Titan Share) ​, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Share)​, టీసీఎస్​, ఇండస్​ ఇండ్ బ్యాంక్ ప్రధానంగా లాభాలను గడించాయి.

ఎస్​బీఐ(SBI Share), బజాజ్​ ఫిన్​సర్వ్, టెక్ మహీంద్రా, సన్​ ఫార్మా, బజాజ్ ఫినాన్స్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

బీఎస్​ఈ 30 షేర్ల ఇండెక్స్​లో 24 కంపెనీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆరు కంపెనీలు మాత్రమే లాభాలను గడించాయి.

Also read: China New Rules: ఆ విదేశీ కంపెనీలు చైనాను ఎందుకు వదిలేశాయి

Also read: Imran Khan: ఉగ్రవాదులతో చర్చలా అంటూ.. ఇమ్రాన్ ఖాన్​పై పాకిస్థాన్​ సుప్రీం కోర్టు ఆగ్రహం!

ఆసియాలో ఇతర మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. షాంఘై (చైనా) టోక్యో (జపాన్​), హాంకాంగ్ సూచీలు లభాలను గడించాయి. సియోల్​ (దక్షిణ కొరియా), థైవాన్​ సూచీసు మాత్రం డీలా పడాయి.

కాస్త పెరిగిన రూపాయి..

డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 13 పైసలు బలపడింది. ప్రస్తుతం మారకం విలువ 74.51 వద్ద కొనసాగుతోంది.

Also read: PNB reduces interest rates: పీఎన్​బీ ఖాతాదారులకు షాక్​- సేవింగ్స్ ఖాతాల వడ్డీకి కోత

Also read: Equity Mutual Funds: ఈక్విటీ మార్కెట్‌లో పురోగతి, భారీగా పెట్టుబడులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News