Best Hyundai Creta: రూ. 8 లక్షలకే హ్యుందాయ్ క్రెటా.. వెంటనే కొనేసుకోండి! ఈ అవకాశం మళ్లీమళ్లీ రాదు

Second Hand Hyundai Creta Cars buy only 8 Lakhs in Cars 24. రూ.8 లక్షలకే హ్యుందాయ్ క్రెటాను ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. Cars24 వెబ్‌సైట్‌లో  బెస్ట్ హ్యుందాయ్ క్రెటాలు ఉన్నాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 16, 2023, 01:31 PM IST
  • రూ. 8 లక్షలకే హ్యుందాయ్ క్రెటా
  • వెంటనే కొనేసుకోండి
  • ఈ అవకాశం మళ్లీమళ్లీ రాదు
Best Hyundai Creta: రూ. 8 లక్షలకే హ్యుందాయ్ క్రెటా.. వెంటనే కొనేసుకోండి! ఈ అవకాశం మళ్లీమళ్లీ రాదు

Second Hand Hyundai Creta Cars buy only 8 Lakhs in Cars 24: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో 'హ్యుందాయ్ క్రెటా' ఒకటి. ప్రస్తుతం 27 విభిన్న వేరియంట్లు మరియు 5 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. క్రెటా కార్ ధర 10.64 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. సెకండ్ హ్యాండ్ హ్యుందాయ్ క్రెటాను కొనుగోలు చేయాలనుకుంటే.. మార్కెట్లో చాలా ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. దాదాపు రూ.8 లక్షలకే హ్యుందాయ్ క్రెటాను ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. Cars24 వెబ్‌సైట్‌లో ఉన్న బెస్ట్ హ్యుందాయ్ క్రెటాలను ఓసారి పరిశీలిద్దాం. 

Hyundai Creta 1.6 S MANUAL:
2016 హ్యుందాయ్ క్రెటా 1.6 ఎస్ మాన్యువల్ ధర రూ.7,95,000. ఈ కారు రెండవ యజమాని వద్ద ఉండగా.. 19,798 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇది పెట్రోల్ ఇంజన్ కారు. నంబర్ ప్లేట్ DL-1Cతో మొదలవుతుంది. ఈ కారు ఢిల్లీలో అమ్మకానికి అందుబాటులో ఉంది.

Hyundai Creta 1.6 S MANUAL:
2015 హ్యుందాయ్ క్రెటా 1.6 S మాన్యువల్ ధర రూ.8,22,000లుగా ఉంది. ఈ కార్ మొదటి యజమాని కేవలం 27,923 కిలోమీటర్లు మాత్రమే తిప్పాడు. ఇది పెట్రోల్ ఇంజన్ కారు కాగా.. నంబర్ ప్లేట్ UP-32తో మొదలవుతుంది. ఈ కార్ ఢిల్లీలో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంది.

Hyundai Creta 1.6 E + VTVT MANUAL: 
2018 హ్యుందాయ్ క్రెటా 1.6 E + VTVT మాన్యువల్ కారు ధర రూ.8,71,000. ఈ  కారు మొదటి యజమాని 64,849 కిలోమీటర్లు నడిపాడు. ఈ కార్ పెట్రోల్ ఇంజన్ కాగా.. నంబర్ ప్లేట్ DL-5Cతో మొదలవుతుంది. ఇది ఢిల్లీలో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంది.

Hyundai Creta 1.6 E + VTVT MANUAL:
2018 హ్యుందాయ్ క్రెటా 1.6 E + VTVT మాన్యువల్ కారు ధర రూ.7,90,000లుగా ఉంది. ఈ కారు మొదటి యజమాని 80,985 కిలోమీటర్లు తిప్పాడు. ఈ కారు పెట్రోల్ ఇంజన్ కాగా.. నంబర్ ప్లేట్ UP-14తో మొదలవుతుంది. ఇది ఢిల్లీలో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంది.

Also Read: Virat Kohli Fan: మైదనంలోకి దూసుకొచ్చి.. విరాట్ కోహ్లీ కాళ్లు పట్టుకున్న అభిమాని! సూర్య భాయ్ ఏం చేశాడంటే  

Also Read: Virat Kohli Centuries: విరాట్ కోహ్లీ అలా చేస్తేనే.. సచిన్ 100 సెంచరీలు అందుకోగలడు: సునీల్ గవాస్కర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News