SEBI on Hindenburg: 2023 జనవరిలో ప్రచురితమైన హిండెన్‌బర్గ్ నివేదిక అదానీ గ్రూప్‌ను పాతాళానికి నెట్టేసింది. ఆదానీ గ్రూప్‌పై చేసిన తీవ్ర ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సిందిగా సెబీని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
2023 జనవరిలో వెలువడిన హిండెన్‌బర్గ్ నివేదిక అదానీ గ్రూపును తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో నెట్టేసింది. ఎక్కౌంటింగ్ మోసాలు, కృత్రీమంగా షేర్ల విలువలు పెంచడం, మనీ లాండరింగ్ ఆరోపణలు చేసింది హిండెన్ బర్గ్ నివేదిక. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక సమర్పించాల్సిందిగా సుప్రీంకోర్టు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని ఆదేశించింది. ఈ విచారణను పూర్తి చేసేందుకు 6 నెలల గడువు పొడిగించాలని కోరుతూ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఇప్పటివరకూ సమీకరించిన ఫలితాలను ధృవీకరించేందుకు మరింత సమయం పడుతుందని కోరింది. హిండెన్‌బర్గ్ నివేదికలోని ఆరోపణలు నిర్ధారించేందుకు కనీసం 15 నెలల సమయం పడుతుందని కానీ 6 నెలల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సెబీ తెలిపింది.
హిండెన్‌బర్గ్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మార్చ్ 2న ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో సుప్రీంకోర్టు 2 నెలల్లోనే విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. ఆ సమయం ఇప్పుడు ముగియడంతో గడువు పెంచాలని మరోసారి కోరింది. నివేదికలోని ఆరోపణలు సంక్లిష్టంగా ఉన్నాయని..ఉప లావాదేవీలు సైతం వెలుగు చూశాయని సెబీ తెలిపింది. వివిధ కంపెనీలు సమర్పించిన డాక్యుమెంట్ల ధృవీకరణను వివరణాత్మక విశ్లేషణ చేయాలని సెబీ వివరించింది. విదేశీ బ్యాంకుల స్టేట్‌మెంట్స్ తీసుకోవల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ వివరాలను క్రోడీకరిస్తూ, నిర్ధారణ చేసేందుకు మరింత సమయం అవసరమని భావించిన సెబీ కనీసం 6 నెలల సమయం కావాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ఉన్నత స్థాయి కమిటీని సుప్రీంకోర్టే నియమించింది.
Also read: EPF Money For Marriages: పెళ్లి కోసం పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేయొచ్చా ? ఏం చేయాలి ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook