SBI Loans: ఎస్బీఐ నుంచి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఏ విధమైన గ్యారంటీ లేకుండా 25 లక్షల వరకూ రుణాలిస్తున్నారనేది ఆ న్యూస్ సారాంశం. నారీ శక్తి యోజన పథకంలో భాగంగా ఈ రుణలిస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం..
సోషల్ మీడియా విస్తృతి పెరిగే కొద్దీ ఏ న్యూస్ నిజమో ఏది కాదో తెలియని పరిస్థితి నెలకొంది. అటువంటిదే ఓ మెస్సేజ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ మెస్సేజ్ వ్యాపిస్తోంది. మహిళలకు ఎస్బీఐ ఏ విధమైన గ్యారంటీ లేకుండానే 25 లక్షల రుణాలిస్తోంది. నారీ శక్తి యోజనలో భాగంగా ఈ రుణం ఇస్తున్నారనే వార్త అది. అవసరమైన మహిళలకు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఈ సహాయం అందుతోందని ఆ మెస్సేజ్‌లో ఉంది.
నారీ శక్తి యోజన పథకం కింద ఇస్తున్న 25 లక్షల రూపాయల రుణం వడ్డీ రహితమని కూడా ప్రచారం జరుగుతోంది. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లలో అసలు లేని పథకాల గురించి ప్రచారం సాగుతోంది. అయితే ఫ్యాక్ట్ చెక్‌లో ఇదంతా ఫేక్ అని తేలింది. కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ, ఎస్బీఐ నుంచి గానీ ఇలాంటి రుణ సౌకర్యాలు లేవని తేలింది.
మీకూ అలాంటి మెస్సేజ్‌లు వస్తే..నిజమా కాదా అనేది నిర్ధారించుకోవాలి. అది తెలుసుకునేందుకు https://factcheck.pib.gov.in.సంప్రదించడం లేదా +918799711259 కు వాట్సప్ మెస్సేజ్ చేయడం లేదా pibfactcheck@gmail.com మెయిల్ పంపించడం ద్వారా తెలుసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook