Amrit Kalash Deposit Scheme: ప్రజలు పొదుపు చేసుకునే సొమ్ముపై అన్ని బ్యాంకులు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తద్వారా ప్రజలు తమ డబ్బును బ్యాంకుల్లో వివిధ పథకాలలో డిపాజిట్ చేసుకుని.. మంచి రాబడి పొందవచ్చు. ఈ క్రమంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారుల కొత్త పథకం తీసుకువచ్చింది. ఇందులో మంచి వడ్డీని అందజేస్తోంది. అధిక వడ్డీ రేట్లతో కొత్త ప్రత్యేక ఎఫ్‌డీ పథకాన్ని ప్రకటించింది ఎస్‌బీఐ. సాధారణ కేటగిరీ పెట్టుబడిదారులతో పాటు సీనియర్ సిటిజన్లకు కూడా ఈ పథకం అందుబాటులో ఉంటుందని ఎస్‌బీఐ ప్రకటించింది. అయితే ఇది లిమిట్ పిరియడ్ ఆఫర్ అని.. వచ్చే నెలలో ముగుస్తుందని వెల్లడించింది.
అమృత్ కలాష్ డిపాజిట్ పేరుతో పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఈ పథకంలో ఆకర్షణీయమైన వడ్డీ రేటు.. 400 రోజుల కాలవ్యవధి ఉంటుందని పేర్కొంది. దేశీయ, ఎన్ఆర్ఐ కస్టమర్ల కూడా అమృత్ కలాష్ డిపాజిట్ పథకం అందుబాటులో ఉంటుందని చెప్పింది. సాధారణ కేటగిరీ పెట్టుబడిదారులతో పాటు సీనియర్ సిటిజన్లు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని బ్యాంక్ తెలిపింది.
ఈ కొత్త డిపాజిట్ పథకం ఈ నెల 15వ తేదీ నుంచి మార్చి 31, 2023 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రజలు ఈ మధ్య కాలంలో తమ పెట్టుపెడి ప్రారంభించవచ్చు. అమృత్ కలాష్ డిపాజిట్ పథకం కింద సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీని అందిస్తుండగా.. ఇతరులకు 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం 400 రోజుల కాలవ్యవధిలో ముగుస్తుంది. మెచ్యూరిటీపై వడ్డీ చెల్లించనుంది ఎస్‌బీఐ. ఈ పథకంలో ఆదాయపు పన్ను చట్టం ప్రకారం టీడీఎస్ వర్తిస్తుంది.
Introducing “Amrit Kalash Deposit” for domestic and NRI customers with attractive interest rates, 400 days tenure and much more.
*T&C Apply#SBI #Deposit #AzadiKaAmritMahotsav pic.twitter.com/mRjpW6mCvS— State Bank of India (@TheOfficialSBI) February 15, 2023
అంతేకాకుండా ఎవరైనా 400 రోజుల కంటే ముందుగా నగదు ఉపసంహరించుకోవాలనుకుంటే.. విత్ డ్రా చేసుకోవచ్చు. కొత్త అమృత్ కలాష్ డిపాజిట్లపై ముందస్తు ఉపసంహరణ, లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని ఎస్‌బీఐ బ్యాంక్ వెల్లడించింది. ఈ మేరకు వివరాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ పథకం ఎస్‌బీఐ యోనో, లైఫ్‌స్టైల్‌లో అందుబాటులో లేదని తెలిపింది.
Also Read: IPL 2023: రాజస్థాన్ రాయల్స్‌కు భారీ ఎదురుదెబ్బ.. ఆసుపత్రి బెడ్‌పై టీమిండియా స్పీడ్ స్టార్
Also Read: Geetha Singh: రోడ్డు ప్రమాదంలో హాస్యనటి గీతాసింగ్ కుమారుడు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
SBI New Scheme 2023: తీపికబురు చెప్పిన ఎస్‌బీఐ.. లిమిటెడ్ ఆఫర్.. ఎగబడుతున్న జనం