SBI Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) మరోసారి తన ఖాతాదారులకు అప్రమత్తం చేసింది. ఫేక్ మెసేజ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఫోన్లకు వచ్చే అనధికారిక సమాచారాన్ని నమ్మొద్దని పేర్కొంది. ఒకవేళ అలాంటి సందేశం వస్తే తమకు తెలియజేయాలని స్పష్టం చేసింది. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) భద్రతను రెట్టింపు చేసింది.
తాజాగా ఎస్‌బీఐ(SBI) ఖాతాలను బ్లాక్ చేశారంటూ చాలా మందికి మరో ఫేక్ మెసేజ్‌లు వెళ్లాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎస్‌బీఐ, ఆర్బీఐ అప్రమత్తమయ్యాయి. వీటి పట్ల అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించాయి. నకిలీ ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్‌లకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని..రిప్లేలు సైతం చేయవద్దని స్పష్టం చేశాయి. వ్యక్తగత, బ్యాంకింగ్ వివరాలను పంచుకోవద్దని తెలిపాయి.
మళ్లీ అలాంటి ఫేక్ మెసేజ్‌లు వస్తే వాటిని report.phishing@sbi.co.inకు పంపాలని ఎస్‌బీఐ పేర్కొంది. ఇందులోభాగంగానే తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ హెచ్చరికలు జారీ చేసింది. గతంలోనూ ఎస్‌బీఐ బ్యాకింగ్‌పై ఫేక్ మెసేజ్‌లు వైరల్‌గా మారాయి. ఈఏడాది మార్చిలోనూ ఎస్‌బీఐ కస్టమర్లకు ఇలాంటి మెసేజ్‌లు వెళ్లాయి. కేవైసీ(KYC) నిబంధనలను పాటించకపోవడంతో ఖాతాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
వెంటనే లింక్ ఇంచి కేవైసీ(KYC) అప్‌డేట్ చేయమని చెప్పి అందినకాడికి కేటుగాళ్లు దోచుకున్నారు. దీనిపై పలు బ్రాంచ్‌ల్లో ఫిర్యాదు సైతం అందాయి. మళ్లీ ఆ పరిస్థితి రాకుండా ముందే ఎస్‌బీఐ అలర్ట్ అయ్యింది. ఖాతాదారులందరీని అప్రమత్తం చేసింది.
Also read:Pawan Kalyan: సీఎం జగన్..పెట్రోల్, డీజిల్‌పై పన్ను ఎప్పుడు తగ్గిస్తారు..? పవన్ కళ్యాణ్ ఫైర్..!
Also read:Sekhar Movie: జీవితా రాజశేఖర్ దంపతులకు షాక్..సినిమా నిలిపివేయాలని కోర్టు ఆదేశం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook