/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Salary Hike 2024: దేశంలోని వివిధ సంస్థల్లో పనిచేసే ప్రైవేట్ ఉద్యోగుల జీతభత్యాలపై జరిపిన అధ్యయనాల ప్రకారం ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయని తేలింది. ముఖ్యంగా ఆటోమొబైల్, మేన్యుఫాక్చరింగ్, ఇంజనీరింగ్, లైఫ్ సైన్సెస్ రంగాల ఉద్యోగులకు గరిష్టంగా 10 శాతం జీతాలు పెరగనున్నాయి.

మెర్సర్ అనే అమెరికన్ సర్వే కన్సల్టింగ్ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం 2024లో సరాసరి జీతం పెరుగుదల ఇండియాలో 10 శాతం ఉండవచ్చని అంచనా. అదే గత ఏడాది 9.5 శాతం పెరిగింది. ఈ సర్వే ప్రకారం ఆటోమొబైల్, తయారీ, ఇంజనీరింగ్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ఉద్యోగులకు గరిష్టంగా 9.7 శాతం నుంచి 10 శాతం వరకూ పెరుగుదల ఉండవచ్చు. 9.5 శాతం పెరుగుదల కన్జ్యూమర్ అండ్ రిటైల్ రంగంలో ఉండవచ్చు. ఈ అధ్యయనం ప్రకారం ఇండియాలో వాలంటరీ యాట్రిషన్ రేటు క్రమంగా పెరుగుతోంది. అది 2021లో 12.1 శాతం ఉన్న యాట్రిషన్ రేటు 2022 నాటికి 13.5 శాతమైంది. అంతేకాకుండా 2022 మొదటి ఆరు నెలలతో పోలిస్తే 2023లో ఉద్యోగాలు వదిలేవారి సంఖ్య కొద్దిగా పెరిగింది. 

అంటే ప్రతియేటా ఉద్యోగాలు వదులుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదే పరిస్థితి బ్రెజిల్, చైనా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల్లో కూడా కన్పించింది. ఇండియాలో 1474 కంపెనీల్లో 6 వేలకు పైగా ఉద్యోగుల డేటా ఆధారంగా ఈ అధ్యయనం రూపొందింది.

దేశంలోని మెర్సర్ రివార్డ్స్ కన్సల్టింగ్ లీడర్ అయిన మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం ఇండియా పురోగతి మార్గంలో పయనిస్తోంది. జీతాలు క్రమంగా పెరుగుతుండటం దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపిస్తోంది. ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి సంకేతంగా మారుతోంది. అదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ అనేది ఆటోమొబైల్, తయారీ, ఇంజనీరింగ్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో కొత్త పుంతలు తొక్కేందుకు దారి తీస్తున్నాయి. 

Also read: Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్, భారీగా జీతం పెంపు, వారానికి 5 రోజుల పనిదినాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Salary Hike Expectation in private sector, this year maximum of 10 percent salary expected to increase rh
News Source: 
Home Title: 

Salary Hike 2024: ఈ ఏడాది ప్రైవేట్ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయా

Salary Hike 2024: ఈ ఏడాది ప్రైవేట్ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయా
Caption: 
Salary hike ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Salary Hike 2024: ఈ ఏడాది ప్రైవేట్ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయా
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Wednesday, February 28, 2024 - 19:54
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
14
Is Breaking News: 
No
Word Count: 
239