Oil Prices increase:: మళ్లీ ఆకాశాన్ని అంటనున్న వంట నూనె ధరలు... కారణం?

Russia Ukraine Crisis Effect: మన దేశంలో ఉపయోగించే వంటనూనెకు ఉక్రెయిన్‌తో సంబంధం ఉన్న నేపథ్యంలో... ఉక్రెయిన్‌తో రష్యా వివాదం ఇప్పుడు ఇండియాపై భారీ ప్రభావం చూపనుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 17, 2022, 11:26 PM IST
  • ప్రపంచ దేశాల్ని కలవరపెడుతోన్న ఉక్రెయిన్ సంక్షోభం
  • ఈ సంక్షోభంతో భారతదేశంపై ప్రభావం
  • భారతీయుల వంటిళ్లపై ఎఫెక్ట్
  • ఉక్రెయిన్‌తో రష్యా వివాదంతో ఇండియాలో వంటనూనెపై ప్రభావం
Oil Prices increase:: మళ్లీ ఆకాశాన్ని అంటనున్న వంట నూనె ధరలు... కారణం?

India Sunflower Oil: ప్రపంచ దేశాల్ని ఉక్రెయిన్ సంక్షోభం కలవరపెడుతోంది. ఈ సంక్షోభంతో భారతదేశంపై కూడా ప్రభావం పడనుంది. భారతీయుల వంటిళ్లపై ఈ ప్రభావం ఉండనుంది. ఉక్రెయిన్‌తో రష్యా వివాదం ఇప్పుడు ఇండియాపై ప్రభావం చూపించడానికి ఒక ప్రధాన కారణం ఉంది. 

భారతదేశంలో ఎంతో మంది ఉపయోగించే వంటనూనె ఉక్రెయిన్‌తో ముడిపడి ఉంది. మనదేశంలో ఎంతో డిమాండ్ ఉన్నటువంటి సన్ ఫ్లవర్‌‌ నూనెను ఉక్రెయిన్‌ నుంచే దిగుమతి చేసుకుంటాం. అయితే ఉక్రెయిన్ సంక్షోభం వల్ల ఆయిల్ కొరత ఏర్పడనుంది. దీంతో ఇండియా మార్కెట్లో సన్‌ ఫ్లవర్‌‌ ఆయిల్‌ రేట్స్‌ భారీగా పెరిగే అవకాశం ఉంది.

మనదేశంలో ఉపయోగించే వంట నూనెల్లో సన్ ఫ్లవర్ నూనే ఎక్కువగా ఉంటుంది. దేశంలో దాదాపు పది శాతానికి పైగానే ఈ నూనె వినియోగిస్తారు. పామ్ ఆయిల్ తర్వాత సన్ ఫ్లవర్ ఆయిల్‌ను ఇండియాలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. 

రష్యా, అర్జెంటీనావంటి దేశాల ద్వారా భారత మార్కెట్లోకి సన్ ఫ్లవర్ వంట నూనె దిగుమతి అవుతోంది. అయితే ఉక్రెయిన్, రష్యా వివాదం వల్ల ఇప్పుడు ఈ దిగుమతి దాదాపుగా ఆగిపోనుంది. ఇండియాలో సన్‌ఫ్లవర్ కుకింగ్ ఆయిల్ దిగుమతికి ఉక్రెయిన్‌ ప్రధాన ఆధారంగా ఉంది.

గతేడాది ఇండియా సుమారు 1.89 మిలియన్ టన్నుల సన్‌ ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంది. ఇందులో 74 శాతం దాకా ఆయిల్‌ ఉక్రెయిన్‌ నుంచి ఇండియాకు వచ్చింది. కాగా క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడం వల్ల ఉక్రెయిన్‌లో సంక్షోభం ఏర్పడడం.. తద్వారా సన్ ఫ్లవర్ ఆయిల్‌ దిగుమతులపై కూడా ప్రభావం పడింది. ఉక్రెయిన్‌, రష్యాల మధ్య కొనసాగుతోన్న రాజకీయ ఉద్రిక్తతల వల్ల సన్‌ ఫ్లవర్‌‌ ఆయిల్ రిటైల్‌ ప్రైస్‌ పెరగడమే కాకుండా, సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.

Also Read: Janhvi Kapoor Photos: బాప్‌రే.. జాన్వి కపూర్‌ని ఇలా ఎప్పుడైనా చూశారా?

Also Read: Giloy Benefits: తిప్పతీగ తింటే లివర్‌ పాడవుద్దా?.. కేంద్రం ఏం చెబుతోంది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News