Paytm FAQs and Answers: పేటీఎంపై మీ సందేహాలు ప్రశ్నలకు ఆర్బీఐ సమాధానాలు

Paytm FAQs and Answers: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యల నేపధ్యంలో యూజర్లలో చాలా సందేహాలు నెలకొన్నాయి. అసలు పేటీఎం పనిచేస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపధ్యంలో ఆర్బీఐ స్వయంగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెల్లడించింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 17, 2024, 02:05 PM IST
Paytm FAQs and Answers: పేటీఎంపై మీ సందేహాలు ప్రశ్నలకు ఆర్బీఐ సమాధానాలు

Paytm FAQs and Answers: దేశంలో ప్రముఖ యూపీఐ యాప్‌గా చెలామణీలో ఉన్న పేటీఎం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది. పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు, చర్యల నేపధ్యంలో చాలా సందేహాలు ఉత్పన్నమౌతున్నాయి. అసలు పేటీఎం ఎంతవరకూ సురక్షితమనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. పేటీఎం విషయంలో యూజర్లలో నెలకొన్న ప్రశ్నలకు ఆర్బీఐ వివరణ ఇస్తోంది. 

ఎక్కౌంట్, కేవైసీ విషయంలో తలెత్తిన అవకతవకల నేపధ్యంలో ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల ప్రకారం పేటీఎం వ్యాలెట్ ఇక పనిచేయదు. పేటీఎం ప్రజల్నించి డబ్బులు స్వీకరించకూడదు. వ్యాలెట్ ఖాళీ అయితే ఫిల్ చేసే అవకాశముండదు. అదే సమయంలో పేటీఎం ఫాస్టాగ్‌లో డబ్బులుంటే అవి అయ్యేంతవరకూ పనిచేస్తుంది. తరువాత రీఛార్జ్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఈ ఆంక్షలు అమలయ్యేందుకు ఫిబ్రవరి 29 వరకూ తొలుత ఆర్బీఐ గడువిచ్చింది. ఇప్పుడు ఆ గడువును మరో పదిహేను రోజులు అంటే మార్చ్ 15 వరకూ పొడిగించింది. అదే సమయంలో యూజర్లలో పేటీఎం విషయంలో నెలకొంటున్న ప్రశ్నలకు సమాధానాలు వెల్లడించింది. ఆవేంటో తెలుసుకుందాం.

1. నా శాలరీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాకు వస్తుంది. మరి ఈ ఖాతా ఇకపై పనిచేస్తుందా లేదా
మార్చ్ 15 తరువాత పేటీఎం ఎక్కౌంట్ పనిచేయదు. మీ జీతం ఆ ఖాతాలో జమ కాదు. అందుకే మరో ఖాతాకు మారిపోవాలి. 

2. పేటీఎం పేమెంట్స్ ఖాతాలోకి సబ్సిడీ వస్తుందా లేదా
మార్చ్ 15 తరువాత సబ్సిడీ వంటివేవీ పేటీఎం పేమెంట్స్ ఖాతాకు రాదు. మరో బ్యాంక్ ఎక్కౌంట్‌కు మారిపోవడం మంచిది.

3. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో నాకు సేవింగ్స్ ఎక్కౌంట్, కరెంట్ ఎక్కౌంట్ రెండూ ఉన్నాయి. మార్చ్ 15 తరువాత నేను డబ్బులు విత్ డ్రా చేసుకోగలనా లేదా, బ్యాంకు డెబిట్ కార్డు పరిస్థితి ఏంటి
మార్చ్ 15 తరువాత కూడా డబ్బులైతే విత్ డ్రా చేసుకోవచ్చు. డెబిట్ కార్డు ఉపయోగించవచ్చు. అంటే ఎక్కౌంట్‌లో డబ్బులు అయిపోయేవరకే వినియోగించవచ్చు. తరువాత ఎక్కౌంట్ పనిచేయదు.

4. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కరెంట్ ఎక్కౌంట్‌కు డబ్బులు డిపాజిట్ చేయగలమా లేదా
మార్చ్ 15 తరువాత పేటీఎం సేవింగ్ ఎక్కౌంట్ లేదా కరెంట్ ఎక్కౌంటూ రెండూ పనిచేయవు

5. నాకు రావల్సిన రిఫండ్ మార్చ్ 15 తరువాత పేటీఎం పేమెంట్స్ ఖాతాలోకి వస్తుంది. మరి ఆ నగదు ఖాతాలో జమ అవుతుందా లేదా
మార్చ్ 15 తరువాత కూడా రిఫండ్, క్యాష్‌బ్యాక్, వడ్డీ వంటివి బ్యాంకు ఖాతాకు వస్తాయి. కానీ వ్యక్తిగతంగా ఇతరుల్నించి నగదు స్వీకరించలేరు.

6. నా ఓటీటీ సభ్యత్వం నెలవారీ చెల్లింపు పేటీఎం చెల్లింపుల బ్యాంక్ ఖాతా నుంచి ఆటో డెబిట్ అవుతోంది. మార్చ్ 15 తరువాత ఏం జరుగుతుంది.
మార్చ్ 15 తరువాత కూడా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో బ్యాలెన్స్ ఉన్నంతవరకూ పనిచేస్తుంది. తరువాత పనిచేయదు. మరో ఎక్కౌంట్ ఉపయోగించుకోవాలి. 

7. నా కరెంటు బిల్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతుంది. మార్చ్ 15 తరువాత పరిస్థితి ఏంటి
మార్చ్ 15 తురవాత కూడా పేటీఎం పేమెంట్స్ ఎక్కౌంట్‌లో డబ్బులు ఉన్నంతవరకూ ఆ ప్రక్రియ కొనసాగుతుంది. తరువాత మాత్రం సాధ్యం కాదు. 

Also read: Right to Education: ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత సీట్లకు నోటిఫికేషన్ జారీ

8. పేటీఎం పేమెంట్స్ ఎక్కౌంట్ నుంచి ప్రతి నెలా నా లోన్ ఈఎంఐ ఆటోమేటిక్ డెబిట్ అవుతుంది. మార్చ్ 15 తరువాత పరిస్థితి ఏంటి
మార్చ్ 15 తురవాత కూడా పేటీఎం ఎక్కౌంట్‌లో డబ్బులు ఉన్నంతవరకూ పనిచేస్తుంది. తరువాత ఆ ఖాతాలో డబ్బులు జమ చేయలేరు. కాబట్టి పనిచేయదు.

9.  నా లోన్ ఈఎంఐ చెల్లింపు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎక్కౌంట్ నుంచి కాకుండా వేరే బ్యాంక్ ఖాతా నుంచి డెబిట్ అవుతోంది. అది కొనసాగుతుందా
పేటీఎం పేమెంట్స్ ఎక్కౌంట్ కాకుండా ఇతర బ్యాంక్ ఎక్కౌంట్ నుంచి కచ్చితంగా కొనసాగించవచ్చు.

10. పేటీఎం వ్యాలెట్ ఉంది నాకు. దీనిని ఉపయోగించవచ్చా లేదా
మార్చ్ 15 వరకూ ఆ అవకాశం లేదా వ్యాలెట్ ఖాళీ అయ్యేంతవరకే. ఆ తరువాత రీఛార్జ్ లేదా రీఫిల్ అవదు. అందుకే మార్చ్ 15 వరకే ఉపయోగించుకోవచ్చు.

11. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వ్యాలెట్ మూసేసిన తరువాత మిగిలిన బ్యాలెన్స్ మరో బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయవచ్చా
మీరు మీ కేవైసీ వ్యాలెట్ మూసేసి అందులోని బ్యాలెన్స్ మరో ఖాతాకు బదిలీ చేయవచ్చు. 

12.  నాకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో వ్యాలెట్ ఉంది. టాప్ అప్ చేసుకోవచ్చా. మరొకరి నుంచి ఈ వ్యాలెట్‌లోకి డబ్బులు డిపాజిట్ చేసుకోగలమా
సాధ్యం కాదు. క్యాష్‌బ్యాక్, రిఫండ్ మాత్రమే వస్తాయి. టాప్ అప్ జరగదు

13. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వ్యాలెట్‌‌లో క్యాష్‌బ్యాక్ రానుంది. మార్చ్ 15 తరువాత వస్తుందా
మార్చ్ 15 తరువాత కూడా క్యాష్‌బ్యాక్, రిఫండ్ వంటివి కొనసాగుతాయి. 

Also read: AP Fibernet Scam: ఫైబర్‌నెట్ కేసులో ఏ1గా చంద్రబాబు, ఛార్జిషీటు దాఖలు చేసిన సీఐడీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News