Jio Recharge Plans: రూ.1కే 56 జీబీ డేటా అందిస్తున్న రిలయన్స్ జియో, రీఛార్జ్ చేసుకోండి

Reliance Jio Recharge Plans | రీఛార్జ్ ప్లాన్ ద్వారా వినియోగదారులకు కేవలం 1 రూపాయ అధికంగా చెల్లించడం ద్వారా ఏకంగా 56 GB 4జీ ఇంటర్నెట్ మరియు 28 రోజుల అదనపు వ్యాలిడిటీ పొందుతారు.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 26, 2021, 05:58 PM IST
Jio Recharge Plans: రూ.1కే 56 జీబీ డేటా అందిస్తున్న రిలయన్స్ జియో, రీఛార్జ్ చేసుకోండి

భారత్‌లో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన సంస్థ రియలన్స్ జియో. దేశంలోని అతిపెద్ద టెలికం కంపెనీలలో ఒకటైన జియో ఇటీవలే కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఆ రీఛార్జ్ ప్లాన్ ద్వారా వినియోగదారులకు కేవలం 1 రూపాయ అధికంగా చెల్లించడం ద్వారా ఏకంగా 56 GB 4జీ ఇంటర్నెట్ మరియు 28 రోజుల అదనపు వ్యాలిడిటీ పొందుతారు.

ఇక్కడ జియో అందిస్తున్న రూ .598 మరియు రూ .599 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసుకోండి. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్‌ల మధ్య వ్యత్యాసం కేవలం 1 రూపాయ మాత్రమే ఉంది. కానీ వినియోగదారులు 1 రూపాయి అధికంగా చెల్లించడం ద్వారా ప్రత్యేక ప్రయోజనాలు పొందడానికి ఏం ఉంటుందని అనుకుంటారు. కానీ ఈ 1 రూపాయి అధికంగా చెల్లిస్తే అధిక ఇంటర్నెట్ డేటాను అధిక రోజుల వ్యాలిడిటీతో వినియోగించుకోవచ్చు.

Also Read: Gold Price In Hyderabad: బులియన్ మార్కెట్‌లో స్థిరంగా బంగారం ధరలు, దిగొచ్చిన Silver Price

జియో రూ .588 రీఛార్జ్ ప్లాన్
వాస్తవానికి జియో అందిస్తున్న రూ .598 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు. ఈ ప్రిపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే వినియోగదారులు 2GB హై స్పీడ్ 4G డేటా, అపరిమిత లోకల్ మరియు ఇంటర్నేషనల్ కాలింగ్ సదుపాయం కల్పిస్తుంది. మరియు రోజుకు 100 SMS ప్రయోజనాన్ని పొందుతారు. ఈ ప్రిపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా అదనపు నగదు చెల్లించకుండానే జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు డిస్నీ + హాట్‌స్టార్ 1 సంవత్సరం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా మీకు అందిస్తుంది.

599 రూపాయల జియో ప్లాన్
మీరు జియో యొక్క రూ .599 ప్రిపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే కలిగే ప్రయోజనాలు, వ్యాలిడిటీ ఇక్కడ అందిస్తున్నాం. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే ప్రతిరోజూ వినియోగదారులకు 2 GB హై స్పీడ్ 4G ఇంటర్నెట్, అపరిమిత లోకల్ మరియు ఇంటర్నేషనల్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్ ఉచితంగా మీ స్నేహితులు, బంధువులకు, కొలీగ్స్‌కు పంపవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. వీటితో పాటు జియో అప్లికేషన్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందుకుంటారు. 

Also Read: 7th Pay Commission Latest News: 28 శాతానికి పెరగనున్న DA, జూలై నుంచి ఉద్యోగులకు సవరించిన వేతనాలు

పైన తెలిపిన రిలయన్స్ జియో రూ.598 మరియు రూ.599 ప్రిపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ మధ్య వ్యత్యాసం కేవలం రూ.1 మాత్రమే. అంటే మీరు కేవలం 1 రూపాయి అధికంగా చెల్లించి రీఛార్జ్ చేసుకోవడం ద్వారా మీకు అదనంగా 56 జీబీ ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. 28 రోజుల అదనపు వ్యాలిడిటీని రిలయన్స్ జియో మీకు అందిస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News