Jio Prepaid Tariffs: జియో యూజర్లకు షాక్, భారీగా పెరిగిన ప్రీ పెయిడ్ ధరలు

Jio Prepaid Tariffs: రిలయన్స్ జియో మరోసారి తన యూజర్లకు షాక్ ఇచ్చింది. ప్రీ పెయిడ్ ప్లాన్స్ ధరల్ని ఏకంగా 20 శాతం పెంచింది. పెరిగిన టారిఫ్‌లతో జియో యూజర్లకు ఆర్ధికంగా భారం కలగనుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 15, 2022, 05:14 PM IST
Jio Prepaid Tariffs: జియో యూజర్లకు షాక్, భారీగా పెరిగిన ప్రీ పెయిడ్ ధరలు

Jio Prepaid Tariffs: రిలయన్స్ జియో మరోసారి తన యూజర్లకు షాక్ ఇచ్చింది. ప్రీ పెయిడ్ ప్లాన్స్ ధరల్ని ఏకంగా 20 శాతం పెంచింది. పెరిగిన టారిఫ్‌లతో జియో యూజర్లకు ఆర్ధికంగా భారం కలగనుంది.

టెలికం రంగంలో దిగ్గజ కంపెనీగా ఉన్న రిలయన్స్ జియో మరోసారి యూజర్లకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. కంపెనీ తన ప్రీపెయిడ్ ప్లాన్ ధరల్ని 20 శాతం పెంచడంతో యూజర్లకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఎందుకంటే జియోలో చవక ప్లాన్స్ ధరలు గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా పెరిగిపోయాయి. ఇటీవలే రిలయన్స్ జియో 749 రూపాయల ప్లాన్ ధరను ఏమాత్రం ఆర్భాటం లేకుండా 150 రూపాయలు పెంచేసింది. ఇప్పుడా ప్లాన్ ధర 899 రూపాయలుగా ఉంది. రిలయన్స్ జియో ప్లాన్ కొత్త ధరల గురించి తెలుసుకుందాం..

రిలయన్స్ జియో పెంచిన ప్రీ పెయిడ్ ప్లాన్స్‌లో 155,185,749 రూపాయల ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడీ ప్లాన్స్ ఖరీదుగా మారాయి. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కొత్త ప్లాన్స్ ధరలు ప్రకటించింది. 155 రూపాయల ప్లాన్ ఇప్పుడు 186  రూపాయలైంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో ఏ నెట్వర్క్‌కైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ఇది కాకుండా రోజుకు 1 జీబీ డేటా, వంద ఎస్ఎంఎస్‌‌లు ఉంటాయి. 

185 రూపాయల ప్లాన్ ఇప్పుడు 222 రూపాయలైంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుంటుంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు రోజుకు 2 జీబీ డేటా లభ్యమౌతుంది. వంద ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. ఇక 749 రూపాయల ప్లాన్ ఇప్పుడు ఏకంగా 899 రూపాయలైంది. అంటే ఏకంగా 150 రూపాయలు పెరిగింది. ఈ ప్లాన్ 336 రోజులుంటుంది. దాంతో పాటు ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. 

Also read: 5G Spectrum Auction: దేశంలో 5 జి స్పెక్ట్రమ్ వేలం జూలైకు పూర్తి, ఆమోదించిన కేంద్ర కేబినెట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News