RBL Bank Interest Rates: తమ వినియోగదారులకు ఆర్బీఎల్ బ్యాంక్ గుడ్‌న్యూస్ చెప్పింది. బ్యాంక్ NRE/NRO సేవింగ్స్‌తో సహా ఇతర సేవింగ్ అకౌంట్స్‌పై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. వడ్డీ రేట్లను ఎంపిక చేసిన మొత్తాలపై 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచినట్లు వెల్లడించింది. కొత్త రేట్లు ఆగస్టు 21 అంటే సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. రూ.లక్ష వరకు రోజువారీ బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ అకౌంట్స్‌పై 4.25 శాతం వడ్డీ రేటును బ్యాంక్ చెల్లిస్తుంది. లక్ష నుంచి రూ.10 లక్షల వరకు ఉన్న పొదుపు ఖాతాపై 5.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుంది. అంతేకాకుండా 10 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉన్న అకౌంట్లకు 6.00 శాతం చెల్లిస్తున్నట్లు ఆర్బీఎల్ వెల్లడించింది.
అదేవిధంగా రోజువారీ బ్యాలెన్స్ రూ.25 లక్షల కంటే ఎక్కువ ఉన్న అకౌంట్లపై బ్యాంక్ వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. రూ.25 లక్షల నుంచి రూ.3 కోట్ల మధ్య ఉన్న మొత్తంపై ఆర్బీఎల్ 7 శాతం నుంచి 7.50 శాతానికి పెంచింది. బ్యాంకు రోజువారీ ప్రాతిపదికన అధిక నిల్వ ఉన్న అకౌంట్లపై వడ్డీ రేటును తగ్గించింది. రూ.3 కోట్లు కంటే ఎక్కువ మొత్తంపై వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
అంటే ఇప్పుడు 7 శాతానికి బదులుగా రూ.3 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు ఉన్న అకౌంట్లకు 6.5 శాతం వడ్డీ రేటును చెల్లించనుంది. ఇక రూ.25 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఉన్న అకౌంట్లకు 6.25 శాతం వడ్డీని అందిస్తోంది. రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు 6 శాతం, రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఉన్న అకౌంట్లకు 4 శాతం చొప్పున వడ్డీని ఆర్బీఎల్ అందజేస్తోంది.
గుర్తుంచుకోవాల్సిన అంశాలు:
==> ఖాతాలో రోజు ముగింపు బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీ లెక్కిస్తారు.
==> వడ్డీ ప్రతి సంవత్సరం 30 జూన్, 30 సెప్టెంబర్, 31 డిసెంబర్, 31 మార్చిలో త్రైమాసిక ప్రాతిపదికన కస్టమర్ అకౌంట్లో జమ అవుతుంది.
Also Read: Onion Prices Today: ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 40 శాతం ఎగుమతి సుంకం విధింపు
Also Read: Etela Rajender: లంబాడా తల్లుల శీలాన్ని శంకిస్తున్నారు.. సీఎం కేసీఆర్‌పై ఈటల ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook