Metro Brands IPO: నేటి నుంచే మెట్రో బ్రాండ్స్ ఐపీఓ- షేరు ధర ఎంతంటే?

Metro Brands IPO: రిటైల్ ఫుట్​వేర్ వ్యాపారాలు నిర్వహిస్తున్న మెట్రో బ్రాండ్స్ ఐపీఓ నేటి నుంచి ప్రారంభం కానుంది. షేరు ధర, ఎప్పటి వరకు ఐపీఓ అందుబాటులో ఉంటుంది అనే విశేషాలు మీకోసం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2021, 10:08 AM IST
  • నేటి నుంచి మెట్రో బ్రాండ్స్ ఐపీఓ
  • ఈ నెల 14 వరకు అందుబాటు
  • రూ.295 కోట్లు సమీకరించడమే లక్ష్యం
Metro Brands IPO: నేటి నుంచే మెట్రో బ్రాండ్స్ ఐపీఓ- షేరు ధర ఎంతంటే?

Metro Brands IPO: బిగ్​ బుల్​ రాకేశ్ ఝున్​ఝున్​వాలా (Big Bull Rakesh Jhunjhunwala) ఇన్వెస్టర్​గా ఉన్న.. ప్రముఖ ఫుట్​వేర్ కంపెనీ మెట్రో బ్రాండ్స్​ లిమిటెడ్ నేడు (శుక్రవారం) ఐపీఓకు రానుంది. ఈ నెల 14 వరకు ఐపీఓ (Metro brands IPO) అందుబాటులో ఉంటుంది.

మెట్రో బ్రాండ్​ ఐపీఓ గురించి..

మొత్తం రూ.295 కోట్ల విలువైన షేర్లను ఐపీఓలో విక్రయించనున్నారు మెట్రో బ్రాండ్స్ ప్రమోటర్లు. దీనితో పాటు 2.14 కోట్ల తాజా షేర్లను విక్రయించనున్నారు.

ఒక్కో షేరు ధరను రూ.485 నుంచి రూ.500 మధ్య ఉంచారు.

అప్పర్ ప్రైస్ బ్రాండ్ ద్వారా నిధులు సమీకరిస్తే.. రూ.1,367.5 కోట్లు రావచ్చని అంచనా వేస్తోంది కంపెనీ.

ఐపీఓకు ముందు.. యాంకర్​ ఇన్వెస్టర్ల ద్వారా (Metro brands IPO share price) రూ.410 కోట్లు సమీకరించింది మెట్రో బ్రాండ్స్​. ఇందులో 82.05 లక్షల షేర్లను.. ఒక్కో షేరుకు రూ.500 చొప్పున యాంకర్ ఇన్వెస్టర్లకు విక్రయించింది కంపెనీ.

ఐపీఓ ద్వారా 10 శాతం వాటాను ప్రమోటర్లు వదులుకోనున్నారు. ఫలితంగా కంపెనీల ప్రమోటర్ల వాటా 75 శాతానికి చేరనుంది.

సోసియేట్ జనరల్​, గోల్డ్​మన్​ శాక్స్​, అబుదాబీ ఇన్వెస్ట్​మెంట్ అథారిటీ, హెచ్​డీఎఫ్​సీ లైఫ్​ ఇన్సూరెన్స్ కంపెనీ, ఎస్​బీఐ లైఫ్​ ఇన్సూరెన్స్​ కో లిమిటెడ్​, టాటా ఏఐఏ లైఫ్​ ఇన్సూరెన్స్​ కో లిమిటెడ్​, హెచ్​డీఎఫ్​సీ మ్యూచువల్ ఫండ్, ఆధిత్యా బిర్లా సన్​ లైఫ్ ఎంఎఫ్​, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్​లు ఇందులో యాంకర్ ఇన్వెస్టర్లుగా చేరాయి.

యాక్సిస్​ క్యాపిటల్ యాంబిట్​, డీఏఎం క్యాపిటల్​ అడ్వైజర్, ఈక్విరస్​ క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్​, మోతీలాల్​ ఓశ్వాల్ ఇన్వెస్ట్​మెంట్ అడ్వైజర్ వంటి సంస్థలు ఈ ఐపీఓను నిర్వహిస్తున్నాయి.

నిధుల వినియోగం ఇలా..

ఐపీఓ ద్వారా సేకరించిన నిధులను కొత్త స్టోర్లను ప్రారంభించేందుకు వినియోగించనుంది మెట్రో బ్రాండ్ దీనితో పాటు వ్యాపార అవసరాలకు వినియోగించుకోనుంది. మెట్రో, మోచీ, వాక్​వే, క్ర్రాక్స్ పేరిట ఈ కొత్త స్టోర్లను ప్రారంభించనుంది.

ప్రస్తుత మెట్రో బ్రండ్​కు దేశవ్యాప్తంగా 136 పట్టణాల్లో 598 స్టోర్లు ఉన్నాయి.

Also read: Bank holidays: వచ్చే వారం 4 రోజులు బ్యాంకింగ్ కార్యకలాపాలకు అంతరాయం!

Also read: PM Kisan Yojana: రైతులకు గుడ్ న్యూస్- ఈ నెల 25 లోపు ఖాతాల్లో రూ.2 వేలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News