PPF Benefits: బ్యాంకులు, పోస్టాఫీసులు పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ పథకం ప్రయోజనాలను ఎప్పటికప్పుడు వినియోగదారులకు వివరిస్తుంటాయి. మంచి ఆకర్షణీయమైన వడ్డీ, ట్యాక్స్ మినహాయింపు వంటి లాభాలుంటాయి. పీపీఎఫ్ మెచ్యూరిటీ పీరియడ్ 15 ఏళ్లుంటుంది.
దీర్ఘకాలిక పెట్టుబడి పధకంలో రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ పొందాలంటే పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ మంచి ప్రత్యామ్నాయం. ఇందులో ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేయవచ్చు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఈ పథకం అందుబాటులో ఉంది. పీపీఎఫ్ పధకంలో మంచి వడ్డీ, ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. పెట్టుబడికి ఇది మంచి పధకం. పీపీఎఫ్ కాల వ్యవధి 15 ఏళ్లుంటుంది. నెలకు 5 వేలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ పూర్తయ్యాక 26 లక్షలు ఒకేసారి చేతికి అందుతుంది.
మెచ్యూరిటీ పూర్తయ్యాక మూడు ఆప్షన్లు ఉంటాయి. ఈ మూడు చాలా కీలకం. మొదటిది మెచ్యూరిటీ పూర్తయిన వెంటనే విత్ డ్రా చేసుకోవడం, రెండవది విత్ డ్రా చేయకుంటే వడ్డీ అందుతుంది. మూడవది ఐదేళ్లకు పొడగించడం.
మెచ్యూరిటీ అనంతరం విత్ డ్రా చేసుకోవడం
పీపీఎఫ్ మెచ్యూరిటీ పూర్తయితే మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కౌంట్ క్లోజ్ చేయాలనుకుంటే మొత్తం డబ్బు మీ ఎక్కౌంట్‌కు బదిలీ అయిపోతుంది. పీపీఎఫ్ నగదు, వడ్డీ రెండింటిపై ట్యాక్స్ మినహాయింపు ఉండదు. ఇది కాకుండా ఏడాదికి 1.5 లక్షల వరకూ ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.
పీపీఎఫ్ 5 ఏళ్లకు పొడిగింపు
మెచ్యూరిటీ తరువాత ఐదేళ్లకు పొడిగించడం. ఐదేళ్ల కోసారి పొడిగించుకోవచ్చు. మరో ఐదేళ్లు పొడిగించాలంటే సంబంధిత బ్యాంక్ లేదా పోస్టాఫీసుకు ఒక ఏడాది ముందు సమాచారం అందించాల్సి ఉంటుంది. ప్రీ మెచ్యూర్ విత్ డ్రాయల్ నిబంధనలు ఏవీ వర్తించవు. ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు.
మెచ్యూరిటీ పూర్తయ్యాక ఏం చేయాలి
పై రెండు ఆప్షన్లు ఎంచుకోకపోతే మెచ్యూరిటీ తరువాత కూడా ఎక్కౌంట్ కొనసాగుతుంది. మళ్లీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మరో ఐదేళ్లకు దానికదే పొడిగించబడుతుంది. ఈ ఐదేళ్ల వ్యవధికి కూడా వడ్డీ అందుతుంటుంది. ఐదేళ్లు పూర్తయ్యాక తిరిగి పొడిగించుకోవచ్చు లేదా విత్ డ్రా చేసుకోవచ్చు లేదా దానికదే మరో ఐదేళ్లు పొడిగించబడుతుంది.
ప్రస్తుతం పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్‌పై 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ వార్షిక ఆధారంగా లెక్కిస్తారు. వడ్డీ నిర్ణయించేది మాత్రం ప్రతి మూడు నెలలకోసారి. గత కొద్దికాలంగా పీపీఎప్ వడ్డీరేటులో తేడా ఏమీ లేదు. నెలకు ఐదు వేల చొప్పున పెట్టుబడి పెడితే 15 ఏళ్లు మెచ్యూరిటీ పూర్తయ్యాక చేతికి 26 లక్షల రూపాయలు అందుతాయి.
Also read: IRCTC Refund Rules: ఛార్ట్ ప్రిపేరయ్యాక టికెట్ క్యాన్సిల్‌పై ఫుల్ రిఫండ్ ఎలా వస్తుందో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook