PPF Investment: పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అనేది వడ్డీ పరంగా లేదా ట్యాక్స్ మినహాయింపుకు లేదా మెచ్యూరిటీ తరువాత పెద్దమొత్తంలో అందుకునే డబ్బుపరంగా బెస్ట్ ప్లాన్. పీపీఎఫ్ మెచ్యూరిటీ పీరియడ్ 15 ఏళ్లుంటుంది.
పీపీఎఫ్ అనేది ప్రతి భారతీయుడికి వర్తిస్తుంది. అందుకే అంతగా ప్రాచుర్యం పొందింది. పీపీఎఫ్ ప్రయోజనాలు కూడా ఇతర ప్లాన్స్‌తో పోలిస్తే ఏ విధమైన రిస్క్ లేకుండా ఆకర్షణీయమైన రిటర్న్స్‌తో కూడి ఉంటాయి. బ్యాంక్ లేదా పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉండే పీపీఎఫ్ పధకం గురించి పూర్తి వివరాలు అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. మెచ్యూరిటీ పూర్తయితే పెద్దమొత్తంలో డబ్బులు చేతికి అందుతాయి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికీ ఇది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఈ ప్లాన్‌తో కలిగే ముఖ్యమైన ప్రయోజనమేంటంటే మెచ్యూరిటీ వరకూ ఉంచినా ఉంచకపోయినా వడ్డీ మాత్రం ఆగదు. పీపీఎఫ్ మెచ్యూరిటీకు మూడు ఆప్షన్లు ఉంటాయి. మీరు ఎంచుకునే ఆప్షన్‌ను బట్టి డబ్బులు పెంచుకోవచ్చు.
15 ఏళ్లకు మెచ్యూరిటీ
పీపీఎఫ్ మెచ్యూరిటీ తరువాత మొత్తం డబ్బుతో పాటు దానిపై లభించే వడ్డీని విత్‌డ్రా చేసుకోవచ్చు. క్లోజ్ చేయాలంటే మీ డబ్బు మీ ఎక్కౌంట్‌కు చేరిపోతుంది. అన్నింటికంటే ముఖ్యమైంది మొత్తం డబ్బుపై ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బులపై ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు.
5-5 ఏళ్లకు ఇన్వెస్ట్‌మెంట్
మెచ్యూరిటీ తరువాత మీరు మీ ఎక్కౌంట్‌ను పొడిగించుకోవచ్చు. పొడిగింపు అనేది ఐదేళ్లకు ఉంటుంది. ఐదేళ్ల తరువాత మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. అయితే మెచ్యూరిటీ కంటే ఒక ఏడాది ముందే పొడిగింపు కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. పొడిగింపు సమయంలో ఎప్పుడైనా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రీ మెచ్యూర్ విత్‌డ్రాయల్ నిబంధనలేవీ ఇక్కడ వర్తించవు.
ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా 5 ఏళ్లకు పొడిగింపు
పై రెండు ఆప్షన్లు ఎంచుకోకపోతే మీ ఎక్కౌంట్ మెచ్యూరిటీ తరువాత కూడా కొనసాగుతుంది. మరోసారి ఇన్వెస్ట్ చేయాలనే తప్పనిసరి లేదు. ఐదేళ్లకు దానికదే పొడిగించబడుతుంది. ఈ ఐదేళ్లు కూడా వడ్డీ లభిస్తుంది. 5-5 ఏళ్లకోసారి పొడిగించవచ్చు.
పీపీఎఫ్ ఎక్కౌంట్ అనేది ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకులోనైనా ఓపెన్ చేసుకోవచ్చు. మైనర్లు కూడా ఈ ఎక్కౌంట్ ఓపెన్ చేయవచ్చు గానీ తల్లిదండ్రులు ఎక్కౌంట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ మాత్రం ఎక్కౌంట్ ఓపెన్ చేయలేరు. పీపీఎఫ్ ఎక్కౌంట్‌పై 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. 15 లేదా 20 ఏళ్లకు నెలకు 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తరువాత 5.32 లక్షలు అందుకోవచ్చు. అదే నెలకు 2 వేలు ఇన్వెస్ట్ చేస్తే 20 ఏళ్ల తరువాత 10.65 లక్షలు, 15 ఏళ్లుకు 6.50 లక్షలు అందుకోవచ్చు. అదే నెలకు 3 వేలు పెట్టుబడి పెడితే 15 ఏళ్లకు 9.76 లక్షలు, 20 ఏళ్లకు 15.97 లక్షలు అందుకోవచ్చు. అదే నెలకు 5 వేలు ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లకు 16.27 లక్షల రూపాయలు, 20 ఏళ్లకు 26.63 లక్షలు అందుకోవచ్చు.
Also read: Vitamin B12 Side Effects: విటమిన్ బి12 మోతాదు దాటి తీసుకుంటే ఏమౌతుంది, ఎలాంటి దుష్పరిణామాలుంటాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook