Prepaid Tariff Hike: ప్రీపెయిడ్ యూజర్లకు భారీ షాక్.. మరోసారి పెరగనున్న రీఛార్జ్ ప్లాన్స్!

Prepaid Tariff Hike: ఎయిర్ టెల్, జియో, వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు షాకింగ్ న్యూస్. త్వరలోనే మరోసారి ప్రీపెయిడ్ టారిఫ్ లు పెరగనున్నాయి. దీని ద్వారా రీఛార్జ్ ప్లాన్స్ పై మరింత భారం పడనుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 25, 2022, 11:03 AM IST
Prepaid Tariff Hike: ప్రీపెయిడ్ యూజర్లకు భారీ షాక్.. మరోసారి పెరగనున్న రీఛార్జ్ ప్లాన్స్!

Prepaid Tariff Hike: ప్రముఖ టెలికాం నెట్ వర్క్స్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్! రాబోయే దీపావళి నుంచి భారతదేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీలు మరోసారి రీఛార్జ్ ధరలను పెంచనున్నారు. ప్రీపెయిడ్ టారిఫ్ లను 10 శాతం నుంచి 12 శాతం వరకు పెంచవచ్చని సమాచారం. పెరగనున్న టారిఫ్ లు అక్టోబర్ లేదా నవంబర్ నాటికి ఈ పెంపుదల అమలులోకి రావొచ్చని తెలుస్తోంది. ఈ ప్రీపెయిడ్ టారిఫ్ పెంపుతో ఒక్కో వినియోగదారుపై సగటు ఆదాయం (ARPU) సంఖ్య మరో 10% పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

ET టెలికాం నివేదిక ప్రకారం.. అమెరికన్ ఈక్విటీ రీసెర్చ్ సంస్థ విలియం ఓ'నీల్ & కో భారతీయ యూనిట్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ మయూరేష్ జోషి మాట్లాడుతూ, టెల్కోలు మరో 10% - 12% ప్రీపెయిడ్ టారిఫ్ పెరిగే అవకాశం ఉందని మయూరేష్ స్పష్టం చేశారు. దీంతో భారతీ ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియా రీఛార్జ్ ప్లాన్స్ వరుసగా.. రూ. 200, రూ. 185, రూ. 135 వరకు టారిఫ్ లు పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 

ఎయిర్ టెల్, జియో, వోడాఫోన్ ఐడియా..

దేశవ్యాప్తంగా ఇప్పటికే 4G వ్యాపించిన క్రమంలో టెలికాం నెట్ వర్క్ యూజర్లు గత కొన్ని నెలలుగా భారీగా పెరిగారు. అందులో ఎక్కువ మంది వినియోగదారులు ఎయిర్ టెల్, జియో సంస్థలకు మాత్రమే చెందాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రీపెయిడ్ ప్లాన్‌ల కోసం టారిఫ్ పెంపు భారతీ ఎయిర్‌టెల్ లో కనీస రీఛార్జ్ వెల దాదాపుగా రూ. 200 వరకు టారిఫ్ పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

వోడాఫోన్ ఐడియా తన టారిఫ్ పెంపు వ్యూహంలో ఎయిర్‌టెల్‌ను అనుసరిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. పెరగనున్న టారిఫ్ లో Airtel ఎక్కువగా పెంచుతుందని సమాచారం. దీనికి సమానంగా వోడాఫోన్ ఐడియా కూడా పెరుగుతుంది. ఈ ఏడాది దీపావళి నుంచి దేశంలోని ఈ మూడు ప్రముఖ టెలికాం కంపెనీలు టారిఫ్ లను పెంచనున్నాయి. ఈ క్రమంలో వోడాఫోన్ ఐడియాలో కనీస రీఛార్జ్ ధర రూ. 150 వరకు చేరనుందని తెలుస్తోంది. 

Also Read: Edible Oils: కస్టమ్స్, అగ్రిసెస్ మినహాయింపు, భారీగా దిగుమతి, తగ్గనున్న వంటనూనె ధరలు

Also Read: Apple iPhone 11 Flipkart: ఐఫోన్ 11పై భారీ తగ్గింపు.. రూ.12 వేలకే అందుబాటులో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News