Public Provident Fund: పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఈ ట్రిక్‌తో రూ.కోటిన్నర సంపాదించుకోండి

PPF Balance Check: మీరు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? అయితే మీరు ఓ ట్రిక్‌ను ఫాలో అయి పీపీఎఫ్‌ ద్వారా కోటిన్నర రూపాయలను మీ అకౌంట్‌లో యాడ్ అవుతుంది. ఇందుకోసం మీరేం బుర్రలు బద్ధలు కొట్టాకోవాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలు ఇవిగో..   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2023, 11:39 PM IST
Public Provident Fund: పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఈ ట్రిక్‌తో రూ.కోటిన్నర సంపాదించుకోండి

PPF Balance Check: ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రజాధరణ పొందిన పథకాల్లో ముందు వరుసలో ఉంటుంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌). ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ, అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు, ఇన్‌కమ్ ట్యాక్స్‌ చట్టాల ప్రకారం మెరుగైన ఆదాయం, పన్ను ఆదా పరంగా ప్రయోజనాలు ఉండడంతో ఎక్కువ మంది ప్రజలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. పీపీఎఫ్‌ పథకం 1968లో ఆర్థిక మంత్రిత్వ శాఖ నేషనల్ సేవింగ్స్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ప్రారంభించిన విషయం తెలిసిందే. 

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో ప్రజలు దీర్ఘకాలానికి డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం ద్వారా ప్రజలు పెట్టుబడితో పాటు ట్యాక్స్‌ను సేవ్ చేసుకునే అవకాశాన్ని పొందుతారు. అదేవిధంగా మనం పెట్టిన పెట్టుబడి కూడా లభిస్తుంది. ఈ వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు సమీక్షిస్తారు. అవసరమైతే వడ్డీ రేటును కూడా మార్చవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టి మనం కోట్లాది రూపాయల నిధిని కూడా సృష్టించవచ్చు.
 
పీపీఎఫ్‌ పథకం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు అవుతోంది. భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఇది దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. ఈ పథకానికి 15 సంవత్సరాల మెచ్యూరిటీ సమయం ఉంటుంది. 15 ఏళ్ల తర్వాత.. ఈ పథకాన్ని ఐదేళ్ల బ్లాక్ సమయం ప్రకారం పొడిగించవచ్చు.
 
ప్రస్తుతం ఈ పథకంలో ఏటా 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. పీపీఎఫ్ పథకం ద్వారా కోట్లాది రూపాయల నిధిని సమకూర్చుకోవాలంటే.. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పీపీఎఫ్‌ పథకం నుంచి 1.5 కోట్ల రూపాయల నిధిని ఎలా తయారు చేయవచ్చో  తెలుసుకోండి. ఇందుకోసం ప్రతి ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని 30 ఏళ్లపాటు ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు 30 ఏళ్లపాటు రూ.1.5 లక్షలు పెట్టుబడి పెడితే.. రూ.45 లక్షలు జమ అవుతాయి. ఏటా 7.1 శాతం వడ్డీ లెక్కిస్తే.. 30 ఏళ్లలో రూ.1,09,50,911 వడ్డీ రూపంలో అందుతుంది. డిపాజిట్ మొత్తాన్ని, వడ్డీని కలిపితే..30 సంవత్సరాలలో పీపీఎఫ్‌ పథకం నుంచి 1,54,50,911 రూపాయలను పొందవచ్చు. 

Also Read: CM Jagan Mohan Reddy: వ్యవసాయ కనెక్షన్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఇక నుంచి మరింత వేగం

Also Read: PM Kisan Yojana 2023: పీఎం కిసాన్ స్కీమ్ అప్‌డేట్.. అకౌంట్‌లోకి డబ్బులు ఎప్పుడంటే..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News