Post office Superhit Scheme: ఈ పోస్టాఫీసు స్కీమ్‌తో ప్రతి నెలా గ్యారంటీ ఆదాయం

Post office Superhit Scheme: కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ రిస్క్ కారణంగా వెనుకంజ వేస్తుంటారు. అదే సమయంలో పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ నుంచి క్రమం తప్పకుండా ఆదాయం కూడా కోరుకుంటారు. అటు రిస్క్ లేకుండా ఇటు ఆదాయం మిస్ కాకుండా ఉండాలంటే పోస్టాఫీసు పథకాలు అద్బుతమైనవి. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 2, 2024, 05:31 PM IST
Post office Superhit Scheme: ఈ పోస్టాఫీసు స్కీమ్‌తో ప్రతి నెలా గ్యారంటీ ఆదాయం

Post office Superhit Scheme: రిస్క్ లేకుండా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే పథకాలు పోస్టాఫీసుల్లో చాలానే అందుబాటులో ఉన్నాయి. అలాంటి సూపర్‌హిట్ పథకాల్లో ఒకటి మంత్లీ ఇన్‌కం స్కీమ్. ఈ స్కీమ్ ప్రత్యేకత ఏంటంటే ఒకసారి డిపాజిట్ చేస్తే చాలు ప్రతి నెలా క్రమం తప్పకుండా నిర్ధిష్టమైన ఆదాయం లభిస్తుంటుంది. ఈ స్కీంలో సింగిల్ లేదా జాయింట్ ఎక్కౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు. పోస్టాఫీసుల్లో ఉండే ఈ మంత్లీ ఇన్‌కం స్కీమ్ పూర్తి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

పోస్టాఫీసు పథకాలనేవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో నడిచేవి. ప్రతి మూడు నెలలోసారి వీటిపై ఇచ్చే వడ్డీపై సమీక్ష జరుగుతుంటుంది. ప్రస్తుతం అంటే జనవరి 1 నుంచి పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీంపై 7.4 శాతం వడ్డీ అందుతోంది. ఈ స్కీంలో ఒకసారి డిపాజిట్ చేస్తే ఐదేళ్లపాటు నెలనెలా నిర్దిష్టమైన ఆదాయం తీసుకోవచ్చు. ఉదాహరణకు ఈ స్కీంలో 9 లక్షల రూపాయలు సింగిల్ ఎక్కౌంట్ , 15 లక్షలు జాయింట్ ఎక్కౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ ఐదేళ్లు ఉంటుంది. ఐదేళ్ల తరువాత మరో ఐదేళ్ల చొప్పున పొడిగించవచ్చు. ప్రతి ఐదేళ్లకోసారి అసలు డబ్బుల్ని విత్ డ్రా చేయవచ్చు లేదా కొనసాగించుకోవచ్చు. పోస్టాఫీసు సేవింగ్ ఎక్కౌంట్‌లో ప్రతి నెలా ఈ డబ్బులపై వడ్డీ జమ అవుతుంది. 

మంత్లీ ఇన్‌కం స్కీమ్‌లో 9 లక్షల రూపాయలు సింగిల్ ఎక్కౌంట్‌గా డిపాజిట్ చేస్తే 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. అంటే నెలకు 5,550 రూపాయలు ఆదాయం ఉంటుంది. 12 నెలలకు ఇది 66,600 రూపాయలు అవుతుంది. ఐదేళ్లకు 3.33 లక్షల రూపాయలవుతుంది. ఈ పధకంలో కనీస పెట్టుబడి 1000 రూపాయల్నించి ప్రారంభించవచ్చు. గరిష్టంగా సింగిల్ ఎక్కౌంట్‌లో 9 లక్షలు, జాయింట్ ఎక్కౌంట్‌లో 15 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. జాయింట్ ఎక్కౌంట్‌‌ను సింగిల్ ఎక్కౌంట్‌గా మార్చుకోవచ్చు. దీనికోసం జాయింట్ అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. 

పోస్టాఫీసులో మంత్లీ ఇన్‌కం స్కీమ్ ఓపెన్ చేసేందుకు ఆధార్ కార్డు లేదా పాస్‌పోర్ట్ లేదా వోటర్ ఐడీ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. 2 పాస్‌‌పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్లతో సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి మంత్లీ ఇన్‌కం స్కీమ్ ఎక్కౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు.

Also read: ONGC Recruitment 2024: పరీక్ష లేకుండానే ఓఎన్జీసీలో ఉద్యోగం, మార్చ్ 4 ఆఖరు తేదీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News