Pink Whatsapp: పింక్ వాట్సాప్ లింక్ క్లిక్ చేయవద్దు, మీ అకౌంట్ క్లోజ్ అవుతుంది తెలుసా

What Is Pink Whatsapp | భారత్‌లో వాట్సాప్ ప్రైవసీ పాలసీ చర్చనీయాంశంగా ఉంది. తాజాగా మరో అంశంతో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ట్రెండింగ్ అవుతోంది. వాట్సాప్‌లో కొత్త వర్షన్ వచ్చిందని, గులాబీ రంగులో చూడముచ్చటగా ఉందంటూ కొన్ని లింకులు వాట్సాప్, ఇతరత్రా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 19, 2021, 08:55 PM IST
Pink Whatsapp: పింక్ వాట్సాప్ లింక్ క్లిక్ చేయవద్దు, మీ అకౌంట్ క్లోజ్ అవుతుంది తెలుసా

Pink Whatsapp Is A Virus: గత మూడు నెలలుగా సోషల్ మీడియాలో, భారత్‌లో వాట్సాప్ ప్రైవసీ పాలసీ చర్చనీయాంశంగా ఉంది. తాజాగా మరో అంశంతో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ట్రెండింగ్ అవుతోంది. వాట్సాప్‌లో కొత్త వర్షన్ వచ్చిందని, గులాబీ రంగులో చూడముచ్చటగా ఉందంటూ కొన్ని లింకులు వాట్సాప్, ఇతరత్రా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వాట్సాప్ పింక్, పింక్ వాట్సాప్ వైరల్ లింకులు, వదంతులపై సైబర్ నిపుణులు స్పందిస్తున్నారు. సైబర్ నిపుణుల ప్రకారం.. పింక్ వాట్సాప్ లింక్ అనేది నిజం కాదు. ఒకవేళ మీరు పింక్ వాట్సాప్ అంటూ లింక్ మీద క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి వెళతాయి. మీ ఫోన్ డేటా సైబర్ నేరగాళ్లకు అందిన తరువాత మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. WhatsAppలో ఉన్న ఫొటోలు, వీడియోలతో మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మీ నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు లాగుతారు. ఇంకా మిమ్మల్ని వేధించే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.

Also Read: TikTok APP: భారత్ నిషేధించినా నెంబర్ వన్‌గా నిలిచిన టిక్‌టాక్ యాప్ నెంబర్ వన్‌గా నిలిచిన టిక్‌టాక్ యాప్

సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రాజశేఖర్ రాజహరియా తన సోషల్ మీడియా ఖాతాల్లో దీనిపై స్పందించారు. ‘పింక్ వాట్సాప్ గురించి జాగ్రత్తగా ఉండాలి. ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ లింక్ వాట్సాప్ గ్రూపులలో వైరల్ అవుతోంది.  #WhatsAppPink లింక్ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. ఒకవేళ ఆ పింక్ వాట్సాప్ లింక్ క్లిక్ చేశారంటే  మీరు మీ ఫోన్‌ను పూర్తిస్థాయిలో యాక్సెస్ చేయలేరుని’ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు పోస్ట్ చేశారు. మరికొందరు సైబర్ నిపుణులు సైతం సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అయ్యే లింక్‌లతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

వాట్సాప్ సైతం ఈ విషయంపై పీటీఐతో మాట్లాడింది. ‘ఎవరికైనా అనుకోని, భిన్నంగా ఉండే లేదా అనుమానంగా కనిపించే మెస్సేజ్, మెయిల్స్ లాంటివి వస్తే వాటికి స్పందించకూడదు. అలాంటి అనుమానం ఉన్న మెస్సేజ్‌, మెయిల్ లింక్స్ మీద క్లిక్ చేయకూడదని సూచిస్తున్నాం. వాట్సాప్‌లో ఉన్న కొందరు టూల్స్ ఉపయోగించి మాకు రిపోర్ట్ అందిస్తారు. దాని ఆధారంగా కొన్ని నెంబర్లను బ్లాక్ చేస్తామని’ పీటీఐకి వాట్సాప్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 

Also Read: Google Search: గూగుల్‌లో ఈ విషయాలు అసలు సెర్చ్ చేయవద్దు, లేదంటే బ్యాంక్ ఖాతా ఖాళీ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News