PF Withdrawal Rules: అసలు పీఎఫ్ ఎక్కౌంట్ విలీనమంటే ఏంటి. ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ ఎక్కౌంట్లు కలిగి ఉంటే అన్నింటినీ విలీనం చేయడమే ఈ ప్రక్రియ. ఈ పరిస్థితి ఎందుకంటే చాలామంది వివిధ కంపెనీలు మారుతుంటారు. ఉద్యోగం మారిన ప్రతిసారీ కొత్త పీఎఫ్ ఎక్కౌంట్ క్రియేట్ అవుతుంటుంది. అలా కాకుండా ఒకే పీఎఫ్ ఎక్కౌంట్ కలిగి ఉంటే ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకుందాం..
చాలామంది కెరీర్‌లో మంచి అవకాశాలు, మంచి జీతభత్యాల కోసం తరచూ అంటే ప్రతి 2-3 ఏళ్లకోసారి ఉద్యోగం మారుతుంటారు. అదే సమయంలో జీతభత్యాలు పెరిగే కొద్దీ ట్యాక్స్ కటింగ్స్ కూడా అంతే స్థాయిలో ఉంటాయి. ఈ క్రమంలో ట్యాక్స్ మినహాయింపు మార్గాల్ని అణ్వేషించుకుంటే ప్రయోజనముంటుంది. ఇందులో ఒకటి మీ ప్రోవిడెంట్ ఫండ్ ఎక్కౌంట్లను విలీనం చేయడం. ప్రోవిడెంట్ ఫండ్ అనేది పదవీ విరమణ అనంతరం పనికొచ్చే సేవింగ్ స్కీమ్. ఇందులో ఉద్యోగి, యజమాని ఇద్దరి కంట్రిబ్యూషన్ ఉంటుంది. ఫలితంగా సదరు ఉద్యోగి పదవీ విరమణ అనంతరం ఆర్ధికంగా చేయూత లభిస్తుంది. పదవీ విరమణ తరువాత కూడా స్థిరమైన ఆదాయం కలిగి ఉండాలనేదే ఈ స్కీమ్ ఉద్దేశం.
కొత్తగా ఉద్యోగం ప్రారంభించినప్పుడు మీకొక యూఏఎన్ నెంబర్ అంటే యూనివర్శల్ ఎక్కౌంట్ నెంబర్‌ను ఈపీఎఫ్ఓ కార్యాలయం కేటాయిస్తుంది. మీ యజమాని ఈ యూఏఎన్ నెంబర్ ఆధారంగా మీకొక పీఎఫ్ ఎక్కౌంట్ ఓపెన్ చేస్తాడు. అందులో ప్రతి నెలా కొంతమొత్తం మీ నుంచి, మీ యజమాని నుంచి జమ అవుతుంటుంది. ఉద్యోగం వదిలేసినప్పుడు మీ యూఏఎన్ నెంబర్ కొత్త కంపెనీకు అందిస్తే అదే నెంబర్ ఆధారంగా అక్కడొక పీఎఫ్ ఎక్కౌంట్ ఓపెన్ అవుతుంది. ఇలా ఎన్ని ఉద్యోగాలు చేసినా పాత పీఎఫ్ ఎక్కౌంట్లను ఒకదానితో మరొకటిగా విలీనం చేయడం మంచిది.
ఓ కంపెనీలో మీరు పనిచేసిన కాలం 5 ఏళ్ల కంటే తక్కువై..మీ పీఎఫ్ ఎక్కౌంట్ 50 వేల కంటే తక్కువ ఉంటే ఏవిధమైన ట్యాక్స్ పడదు. అదే మీ పీఎఫ్ మొత్తం 50 వేలు దాటితే మాత్రం 10 శాతం టీడీఎస్ కట్ అవుతుంది. అదే ఐదేళ్ల సర్వీస్ దాటితే మాత్రం మీ పీఎఫ్ మొత్తం విత్‌డ్రాయల్‌పై ఏ విధమైన ట్యాక్స్ కట్ కాదు.
పీఎఫ్ ఎక్కౌంట్ విలీనం చేయకపోతే పరిణామాలు
పీఎఫ్ ఎక్కౌంట్ల విలీనంతో మీ యూఏఎన్ నెంబర్ మీ మొత్తం అనుభవాన్ని ఏకం చేస్తుంది. అంటే రెండేళ్లు చొప్పున మీరు మూడు కంపెనీల్లో పనిచేసుండి పీఎఫ్ ఎక్కౌంట్లను విలీనం చేసుంటే మీ మొత్తం సర్వీస్ ఆరేళ్లుగా పరిగణించబడుతుంది. అదే మీ పీఎఫ్ ఎక్కౌంట్లు విలీనం కాకపోయుంటే మీ సర్వీస్ రెండేళ్లుగానే పరిగణించబడుతుంది. అప్పుడు మీరు మీ పీఎఫ్ నగదును విత్‌డ్రా చేసుకుంటే ఐదేళ్ల సర్వీస్ దాటనందున రెండేళ్లుగానే పరిగణిస్తూ 10 శాతం ట్యాక్స్ కట్ అవుతుంది.
Also read: Passport Big Alert: పాస్‌పోర్ట్ కోసం అప్లై చేస్తున్నారా, కేంద్ర ప్రభుత్వం నుంచి హెచ్చరికలు జారీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook