Petrol Pump Business: పెట్రోల్ బంక్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నారా..? ఎంత ఖర్చవుతుందంటే..?

How To Open Petrol Pump Business: పెట్రోల్ బంక్ ప్రారంభించాలని అనుకుంటున్న వారు ముందుగా.. మంచి స్థలాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మంచి డిమాండ్ ఉన్న ప్లేస్‌లో పెట్రోల్ బంక్ బిజినెస్ స్టార్ట్ చేస్తే లాభాలు ఎక్కువగా ఉంటాయి. లైసెన్స్‌కు ఎంత ఖర్చవుతుందంటే..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 30, 2023, 03:40 PM IST
Petrol Pump Business: పెట్రోల్ బంక్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నారా..? ఎంత ఖర్చవుతుందంటే..?

How To Open Petrol Pump Business: కొన్ని వ్యాపారాలకు ఎప్పటికీ డిమాండ్ తగ్గదు. నిత్య కల్యాణం.. పచ్చ తోరణం మాదిరి ఎప్పుడు కస్టమర్లు వస్తునే ఉంటారు. వాటిలో పెట్రోల్ బంక్ వ్యాపారం ఒకటి. కాస్త మంచి సెంటర్ చూసి.. నాణ్యతతో పెట్రోల్ అందిస్తే.. ఆదాయానికి కొదవ ఉండదు. మూడు పువ్వులు.. ఆరు కాయలుగా బిజినెస్‌ను చక్కగా రన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంధనానికి రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ వ్యాపారం ప్రారంభిస్తే భారీ లాభాలను అర్జించవచ్చు. పెట్రోల్ బంక్ లైసెన్స్ ఎలా పొందాలి..? ఎలా ఇన్వెస్ట్ చేయాలి..? పూర్తి వివరాలు ఇలా..

పెట్రోల్ బంక్ వ్యాపారానికి ముందు స్థలం చాలా ముఖ్యం. మీరు ఎంచుకున్న ప్రదేశాన్ని బట్టే.. మీ బంక్‌కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఆ ఏరియాలో ఎన్ని వాహనాల రద్దీ ఎలా ఉంది..? సమీపంలోని రవాణా మార్గాలకు కూడా డిమాండ్ ఉండాలి. మీరు ఎంచుకున్న స్థలం పెట్రోల్ పంప్ వ్యాపారం కోసం సరైందో కాదో స్థానిక అధికారులను సంప్రదించి తెలుసుకోండి. జోన్ నియమాలను చెక్ చేసుకోండి. పెట్రోల్ బంక్ నిర్మాణానికి భూమిని సేకరించి కచ్చితగా పర్మిషన్ తీసుకోవాలి. ఇందుకోసం ప్రత్యేక లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత అధికారుల నుంచి అనుమతి పత్రాలు మంజూరు చేయాలి. 

పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పీఈఎస్‌ఓ) లేదా సమానమైన నియంత్రణ సంస్థ ద్వారా జారీ చేసిన ఈ లైసెన్స్.. పెట్రోలియం ఉత్పత్తులను నిల్వ చేయడానికి, విక్రయించడానికి అనుమతిస్తుంది. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ లేదా గవర్నింగ్ బాడీ నుంచి పెట్రోల్ బంక్ బిజినెస్ లైసెన్స్ పొందొచ్చు. ఫైర్ సెఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి. అవసరమైన అనుమతులు తీసుకోవాలి.

రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) పొందండి. పురపాలక లేదా రాష్ట్ర అధికారులచే అవసరమైన ఏవైనా ఇతర లోకల్ పర్మిషన్లు తీసుకోండి. మీ పెట్రోల్ పంప్ బిజినెస్‌కు ఎంత ఖర్చు అవుతుందో ముందుగానే అంచనా వేసుకోండి. ఖర్చులలో భూ సేకరణ, నిర్మాణం, పరికరాలు, లైసెన్స్ ఫీజులు, వర్కింగ్ క్యాపిటల్ అన్ని సరిచూసుకోండి. అవసరమైతే లోన్ సదుపాయం కూడా తీసుకోండి. రూ.20 లక్షల నుంచి 50 లక్షల వరకు అవసరం అవుతాయి. లైసెన్స్ ఫీజుల కింద రూ.2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. 

అదేవిధంగా పెట్రోల్ పంప్ నిర్వహణకు అనుభవం ఉన్న ఉద్యోగులను నియమించుకోండి. భద్రతా ప్రోటోకాల్స్, కస్టమర్ సర్వీస్, ఇంధన నిర్వహణపై వారికి సమగ్ర శిక్షణను ఇవ్వండి. అలాగే కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్లను ప్రకటించండి. నాణ్యత, మెయింటెనెన్స్‌పై ఎక్కువ దృష్టిపెట్టండి. నిబంధనలకు అనుగుణంగా నడిపిస్తే.. పెట్రలో బంక్‌ మంచి ఆదాయం ఉంటుంది. 

Also Read: GST On Hostels: హాస్టల్స్, పీజీలో ఉంటున్న వారికి బ్యాడ్‌న్యూస్.. ఫీజుల మోత తప్పదా..?  

Also Read: Telangana Floods: రేపు తెలంగాణకు కేంద్ర అధికారుల బృందం.. వరద నష్టంపై అంచనా    

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News