Petrol Price Today: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు, ఏపీ, Telanganaలోనూ పెట్రో బాదుడే

Petrol Price Today In Hyderabad 15 February 2021: తాజాగా ఫిబ్రవరి 15 (సోమవారం) నాడు లీటర్‌ పెట్రోల్‌ ధర 26 పైసలు, డీజిల్ ధర 29 పెసలు చొప్పున పెరిగింది. ముఖ్యంగా గతేడాది నుంచి వాహనదారుల జేబులు గుల్ల అవుతున్నాయి. 

Written by - Shankar Dukanam | Last Updated : Feb 15, 2021, 09:37 AM IST
  • భారత్‌లో చమురు ధరలు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి
  • లీటర్‌ పెట్రోల్‌ ధర 26 పైసలు, డీజిల్ ధర 29 పెసలు చొప్పున పెరిగింది
  • సోమవారం నాడు ఆల్‌టైమ్ కొత్త గరిష్ఠానికి పెట్రోలు, డీజిల్ ధరలు
Petrol Price Today: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు, ఏపీ, Telanganaలోనూ పెట్రో బాదుడే

Petrol Price Today In Hyderabad 15 February 2021: భారత్‌లో చమురు ధరలు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా గతేడాది నుంచి వాహనదారుల జేబులు గుల్ల అవుతున్నాయి. తాజాగా ఫిబ్రవరి 15 (సోమవారం) నాడు లీటర్‌ పెట్రోల్‌ ధర 26 పైసలు, డీజిల్ ధర 29 పెసలు చొప్పున పెరిగింది. తాజాగా పెరిగిన ధరలతో సోమవారం నాడు ఆల్‌టైమ్ కొత్త గరిష్ఠానికి పెట్రోలు, డీజిల్ ధరలు చేరుకున్నాయి.

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ప్రకారం తాజాగా పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌(Hyderabad)లో సోమవారం ఉదయం పెట్రోల్ ధర లీటర్‌కు రూ.92.53, డీజిల్ ధర రూ.86.55కు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరులోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. గుంటూరులో పెట్రోల్ ధర రూ.95.10, డీజిల్ ధర లీటర్‌పై రూ.88.60 అయింది.

Also Read: Gold Price Today: బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన బంగారం ధరలు, పెరుగుతున్న Silver Price

దేశ రాజధాని ఢిల్లీ(New Delhi)లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.88.99, డీజిల్ ధర రూ.79.35కు పెరిగింది. పెట్రోల్ ధరలు చెన్నైలో రూ.91.19, కోల్‌కతాలో రూ.90.25, ముంబైలో గరిష్టంగా రూ.95.46కి చేరింది.

Also Read: Mutual Funds: రోజుకు రూ.70 ఇన్వెస్ట్ చేసి రూ.1 కోటి వరకు పొందవచ్చు, Best Plan వివరాలు మీకోసం

ఇక డీజిల్‌ ధర లీటర్‌పై ఢిల్లీ(Fuel Prices In Delhi)లో రూ.79.35కు చేరగా, హైదరాబాద్‌లో రూ.86.55 అయింది. ముంబైలో రూ.86.34, చెన్నైలో రూ.84.16, కోల్‌కతాలో రూ.82.94కు అయింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News