Fuel Price Hiked: దేశవ్యాప్తంగా ఆల్​టైం హైకి పెట్రోల్ రేట్లు- ప్రస్తుత ధరలు ఇవే..

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్​ ధరల బాదుడు కొనసాగుతునే ఉంది. తాజగా గురవారం పెట్రోల్ ధర లీటర్​ 31 పైసల నుంచి 36 పైసల చొప్పున పెరిగింది. హైదరాబాద్, విశాఖపట్నం సహా.. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2021, 01:37 PM IST
  • దేశవ్యాప్తంగా ఆగని పెట్రో బాదుడు
  • ఆల్​టైంహైకి పెట్రోల్​, డీజిల్​ ధరలు
  • హైదరాబాద్​లో 36 పైసలు పెరిగిన పెట్రోల్ రేట్
Fuel Price Hiked: దేశవ్యాప్తంగా ఆల్​టైం హైకి పెట్రోల్ రేట్లు- ప్రస్తుత ధరలు ఇవే..

Fuel Price Hiked: దేశంలో పెట్రోల్ డీజిల్ (Petrol Diesel Price) ధరలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా గురువారం మరోసారి పెట్రోల్​, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. తాజా రేట్ల పెంపుతో పెట్రోల్, డీజిల్ ధరలు జీవనకాల గరిష్ఠానికి చేరాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

1) హైదరాబాద్​లో  (Petrol Price in Hyderabad) పెట్రోల్ ధర లీటర్​ 36 పైసలు పెరిగి.. రూ.110.78 వద్దకు చేరింది. లీటర్ డీజిల్ ధర 38 పైసలు పెరిగి.. రూ.103.90 వద్ద ఉంది.

Also Read: Virat Kohli Bowling Video: బ్యాటింగ్ కాదు..బౌలింగ్ తో మెరిసిన కోహ్లీ.. వీడియో వైరల్

2) విశాఖపట్నంలో (Petrol Price in Viag) లీటర్ పెట్రోల్​, డీజిల్ ధరలు 36 పైసల చొప్పున పెరిగాయి. ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.111.22 వద్ద, డీజిల్ ధర రూ.103.76 వద్ద ఉన్నాయి.

ఇతర ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
1) దేశ రాజధాని ఢిల్లీలో (Petrol Price in Delhi) లీటర్​ పెట్రోల్​ ధర 35 పైసలు, డీజిల్ ధర లీటర్​ 35 పైసలు పెరిగింది. దీనితో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్​కు వరుసగా.. రూ.106.54, రూ.95.28 వద్ద ఉన్నాయి.

2) బెంగళూరులో (Petrol Price in Bangalore) పెట్రోల్ ధర లీటర్​ 36 పైసలు పెరిగి రూ.110.21 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర 37 పైసలు పెరిగి.. రూ.101.08 వద్దకు చేరింది.

3) చెన్నైలో (Petrol Price in Chennai) పెట్రోల్ ధర లీటర్​ 31 పైసలు పెరిగి.. రూ.103.58 వద్ద ఉంది. లీటర్ డీజిల్ ధర 34 పైసలు పెరిగి.. రూ.99.56 వద్దకు చేరింది.

Also Read: India Crosses 1 Billion Vaccination: భళా 'భారత్'.. 100 కోట్ల టీకాల పంపిణీ పూర్తి

4) దేశ ఆర్థిక రాజధాని ముంబాయి (Petrol Price in Mumbai) పెట్రోల్ ధర లీటర్​ 34 పైసలు పెరిగి రూ.112.41కి చేరింది. లీటర్ డీజిల్ ధర 37 పైసలు పెరిగి రూ.103.41 వద్ద కొనసాగుతోంది.

5) కోల్​కతాలో (Petrol Price in Kolkata)పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా లీటర్​కు.. 34 పైసలు, 35 పైసల చొప్పున పెరిగాయి. దీనితో లీటర్​ పెట్రోల్ రూ.107.07 వద్దకు చేరింది. డీజిల్ ధర లీటర్​ రూ.98.35 వద్ద కొనసాగుతోంది.

6) రాజస్థాన్​లోని (Petrol Price in Rajasthan)గంగానగర్​లో పెట్రోల్ ధర లీటర్​ రూ.118.59 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.109.41 వద్ద కొనసాగుతోంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్న ప్రాంతం ఇదే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News