Good News for Pensioners: పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్.. 50 శాతం పెరగనున్న పెన్షన్

Good News for Pensioners: పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్. కేంద్ర ప్రభుత్వం తరపున లభించే పెన్షన్‌లో ఏకంగా 50 శాతం పెంపు ఉండబోతోంది. పెన్షన్ పెరగడం వల్ల మీ ఖాతాలో ఎక్కువ డబ్బులు జమ కానున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 8, 2023, 01:07 PM IST
Good News for Pensioners: పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్.. 50 శాతం పెరగనున్న పెన్షన్

Good News for Pensioners: పెన్షనర్లకు శుభవార్త. మీరు పింఛన్ హోల్డర్ అయితే..ఈ ప్రయోజనం మీకు కలగనుంది. కేంద్ర ప్రభుత్వం తరపున లభించే పెన్షన్ ఇకపై 50 శాతం పెరగనుంది. అయితే ఈ ప్రయోజనం కొంతమందికే కలగనుంది. దేశంలో ఇప్పటికే పాత పెన్షన్ విధానం కొనసాగించమనే డిమాండ్ అధికమౌతోంది. అదే సమయంలో పెన్షన్ 50 శాతం పెంచనుండటం నిజంగానే ఓ శుభవార్త.

2006లో రిటైర్ అయిన పెన్షనర్లకు, కుటుంబసభ్యులకు ఈ ప్రయోజనం కలగనుంది. పింఛన్‌పై సమీక్ష అనంతరం అదనపు పెన్షన్ ఇచ్చేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి.

దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌లో పూర్తి వివరాలున్నాయి. 80-85 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న పెన్షనర్లకు, కుటుంబసభ్యులకు 20 శాతం అదనపు పెన్షన్ లభించనుంది. మరోవైపు 85-90 ఏళ్ల వయస్సున్న పెన్షనర్లకు మూల పెన్షన్‌లో 30 శాతం పెరుగుదల ఉంటుంది. అంటే అదనంగా 30 శాతం లభిస్తుంది. 

ఇక 90 నుంచి 95 ఏళ్లున్న పెన్షనర్లు, కుటుంబసభ్యుల పెన్షన్‌ను రివైజ్డ్ బేసిక్ పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్ 40 శాతం అధికంగా లభిస్తుంది. అటు 95-100 ఏళ్ల వయస్సు పెన్షనర్లకు 50 శాతం అదనపు పెన్షన్ లభిస్తుంది. అంతేకాకుండా 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కవ వయస్సున్న పెన్షనర్లకు 100 శాతం అదనపు పెన్షన్ వస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఈ ప్రయోజనం ఉంటుంది అదనపు పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్‌ను ఆమోదించే ప్రక్రియ పెన్షన్ ఆఫీసర్ లేదా ప్రభుత్వరంగ బ్యాంక్ రీజనల్ ఆఫీసర్ నిర్ధారిస్తారు. అదే సమయంలో పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్ మొత్తాన్ని చెల్లించే ఆదేశాలు కూడా సంబంధిత అధికారులే చేస్తారు.

ఇక పాత పెన్షన్ పథకం ప్రయోజనం గురించి పరిశీలిస్తే..చివరిసారిగా డ్రా చేసుకున్న జీతం ఆధారంగా ఉంటుంది. ఇది కాకుండా ఇందులో డీఏ పెంపు కూడా ఉంటుంది. ప్రభుత్వం కొత్త వేతన సంఘం అమలు చేయగానే..పెన్షన్ పెరగనుంది.

Also read: 7th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, హోలీకి ముందే 90 వేలు పెరగనున్న జీతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News