Passport: పాస్‌పోర్ట్ దరఖాస్తు చేస్తున్నారా, ఈ చిన్న పొరపాటు చేస్తే రిజెక్ట్ అయిపోతుంది మరి

Passport: విదేశీ ప్రయాణం చేయాలంటే తప్పకుండా కావల్సింది పాస్‌పోర్ట్. దీనికోసం చాలా డాక్యుమెంట్స్ అవసరమౌతాయి. అందుకే ఏ చిన్న పొరపాటు చేసిన పాస్‌పోర్ట్ రిజెక్ట్ అవడమే కాకుండా..ఇక్కట్లు ఎదుర్కోవల్సి వస్తుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 31, 2022, 01:46 PM IST
Passport: పాస్‌పోర్ట్ దరఖాస్తు చేస్తున్నారా, ఈ చిన్న పొరపాటు చేస్తే రిజెక్ట్ అయిపోతుంది మరి

పాస్‌‌పోర్ట్ అనేది దేశ పౌరులకు ప్రభుత్వం ఇచ్చే ఓ ప్రయాణ డాక్యుమెంట్ లాంటిది. విదేశీ ప్రయాణంలో గుర్తింపుగా, ఫలానా దేశస్థుడిగా చెప్పేది అదే. అందుకే పాస్‌పోర్ట్ దరఖాస్తు సమయంలో ఇచ్చే ప్రతి వివరం జాగ్రత్తగా ఉండాలి.

పాస్‌పోర్ట్ లేకుండా ఏ విదేశీ ప్రయాణం చేయలేం. దేశ నాగరికుడికి ఆ దేశం ఇచ్చే గుర్తింపు కార్డు. ఇందులో సాధారణంగా పేరు, పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశం, పాస్‌పోర్ట్ ఇష్యూ డేట్ ఎక్స్‌పైర్ డేట్, పాస్‌పోర్ట్ నెంబర్, ఫోటో, సంతకం వంటి వివరాలుంటాయి. విదేశాలకు వెళ్లేవారి స్థితిని బట్టి వివిధ రకాల పాస్‌పోర్ట్‌లు ఉంటాయి. మీరు కూడా విదేశాలకు వెళ్లాలనుకుంటే..పాస్‌పోర్ట్ చాలా అవసరం. ఎందుకంటే ఇదే మీ గుర్తింపు, జాతీయతకు నిర్ధారణ.

పాస్‌పోర్ట్

పాస్‌పోర్ట్ అనేది విదేశంలో మీ రక్షణమార్గం లాంటిది. దాంతోపాటు విదేశాలకు వెళ్లినప్పుడు ఆ దేశం జారీ చేసే వీసా కూడా అవసరమౌతుంది. విదేశాలకు వెళ్లడానికి ముందు పాస్‌పోర్ట్ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ పాస్‌పోర్ట్ అప్లై చేయాలంటే చాలా రకాల డాక్యుమెంట్లు అవసరమౌతాయి. మీ గుర్తింపును నిర్ధారించాల్సి ఉంటుంది. పాస్‌‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఏ చిన్న పొరపాటు లేదా తప్పు చేసినా పాస్‌పోర్ట్ రిజెక్ట్ అవుతుంది. 

పోలీసులతో ఇబ్బందులు

పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియ సందర్బంగా అన్నింటికంటే ముందు స్థానిక పోలీసుల ద్వారా మీ ఇంటి చిరునామాను నిర్ధారించడం. పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసేటప్పుడు పోలీసులు మీ ఇంటికి వెరిఫికేషన్ కోసం వస్తారు. ఈ క్రమంలో ఇచ్చిన చిరునామాలో ఆ వ్యక్తి తప్పకుండా ఉండాలి.

మీరు ఇచ్చిన చిరునామాలో మీరు లేకపోతే పోలీసులు మీరు అందుబాటులో లేరనే వివరాలు నమోదు చేస్తారు. ఫలితంగా మీ పాస్‌పోర్ట్ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశముంది. ఈ క్రమంలో ఇచ్చిన చిరునామాలో మీరు తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. ఒకవేళ ఇచ్చిన చిరునామా, ఉండేది వేర్వేరైతే..అదే దరఖాస్తులో స్పష్టంగా ఉండాలి.

Also read: Interest Rate Hike: కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఈ పథకాలకు వడ్డీ రేటు పెంపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News