PAN Card Download: పాన్‌కార్డు పోగొట్టుకుంటే ఏం చేయాలి, ఇ పాన్‌కార్డ్ డౌన్‌లోడ్ ఎలా

PAN Card Download: ఇటీవలి కాలంలో పాన్‌కార్డు వినియోగం అత్యవసరంగా మారుతోంది. ఆర్దిక లావాదేవీల్లో పాన్‌కార్డు ఆవశ్యకత పెరుగుతోంది. ఇలాంటి పాన్‌కార్డు పోగొట్టుకుంటే పరిస్థితి ఏంటి, డూప్లికేట్ తీసుకోవడం ఎలా అనే ప్రశ్నలకు సమాధానమిదే.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 8, 2023, 11:33 AM IST
PAN Card Download: పాన్‌కార్డు పోగొట్టుకుంటే ఏం చేయాలి, ఇ పాన్‌కార్డ్ డౌన్‌లోడ్ ఎలా

PAN Card Download: ప్రతి ఆర్దిక లావాదేవీకు, ఐటీ రిటర్న్స్ పైల్ చేసేందుకు పాన్‌కార్డు అనేది తప్పనిసరిగా మారింది. వ్యాపార వర్గాలకు, ఉద్యోగులకు విధిగా ఉండాల్సిందే. ఒకవేళ మీరు పాన్‌కార్డ్ పోగొట్టుకుంటే తక్షణం ఏం చేయాలి, డూప్లికేట్ ఎలా పొందాలనే వివరాలు తెలుసుకుందాం..

ఆధార్ కార్డు ఎంత అవసరమో పాన్‌కార్డు అవసరం కూడా అంతే పెరుగుతోంది. పాన్‌కార్డును గుర్తింపు కార్డుగా కూడా పరిగణిస్తుండటంతో మరింత అవసరమౌతోంది. కేంద్ర ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే యూనిక్ కార్డు ఇది. ఇందులో ఉండే నెంబర్ అత్యంత కీలకం. పాన్‌కార్డు ఆధారంగా మీ ఆర్ధిక లావాదేవీలు, ట్యాక్స్ వివరాలు అన్నీ వచ్చేస్తాయి.

అత్యంత కీలకమైన డాక్యుమెంట్ పాన్‌కార్డ్. ఇన్‌కంటాక్స్ శాఖ జారీ చేసే ఆల్ఫా న్యూమరిక్ నెంబర్. పాన్‌కార్డు పోగొట్టుకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నెంబర్ ఆధారంగా ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పాన్‌కార్డు పోయినప్పుడు తక్షణం సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి. ఆ తరువాత డూప్లికేట్ పాన్‌కార్డు కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. 

డూప్లికేట్ పాన్‌కా‌ర్డు కోసం ఎలా అప్లై చేయాలి

మందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.protean-tinpan.com/. ఓపెన్ చేయాలి. పాన్ డేటాలో మార్పులు చేర్పులు ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తరువాత మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. దరఖాస్తుదారుడి మెయిల్ కు ఓ టోకెన్ జారీ అవుతుంది. ఆ తరువాత ఈ సైన్ లేదా కేవేసీ ప్రక్రియ పూర్తి చేయాలి. మీ పదో తరగతి సర్టిఫికేట్ లేదా వోటర్ ఐడీ కార్డు కాపీ పంపించాలి. మరోవైపు మీ ఆధార్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ధృవీకరించుకోవాలి. చివరిగా ఇ పాన్ లేదా పాన్‌కార్డు ఆప్షన్ ఎంచుకోవాలి. ఇండియాలో ఉన్నట్టయితే 50 రూపాయలు, విదేశంలో ఉన్నట్టయితే 959 రూపాయలు చెల్లించాలి. మీ రిజిస్టర్ చిరునామాకు 15-20 రోజుల్లో పాన్‌కార్డు చేరుతుంది.

ఎన్ఎస్‌డీఎల్ పోర్టల్ నుంచి ఇ పాన్ కార్డు డౌన్‌లోడ్ ఇలా

https://www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html సందర్శించాలి. హోమ్ పేజీలో రెండు ఆప్షన్లు ఉంటాయి. ఎక్నాలెడ్జ్ నెంబర్ లేదా పాన్ నెంబర్. మీ ఆధార్ నెంబర్, పుట్టినతేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. సూచనలు చదివి ఇచ్చిన బాక్స్ టిక్ చేయాలి. ఇప్పుడు సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. మీ స్క్రీన్‌పై ఇ పాన్‌కార్డు పీడీఎఫ్ కాపీ ప్రత్యక్షమౌతుంది.

Also read: Maruti Dzire Offer: 10 లక్షల కారు కేవలం 62 వేలు చెల్లించి ఇంటికి తీసుకెళ్లండి ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News