PAN-Aadhaar: పాన్​-ఆధార్ లింక్​ చేశారా? ఇంకా ఆరు రోజులే గడువు!

PAN-Aadhaar: పాన్-ఆధార్​ అనుసంధానం పూర్తి చేశారా? చేయకుంటే వెంటనే ఆ ప్రక్రియను ముగించడం మంచిది. ఎందుకంటే మార్చి 31తో అందుకు గడువు ముగియనుంది. ఈ అంశంపై మరింత సమాచారం మీ కోసం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2022, 07:38 PM IST
  • పాన్-ఆధార్ లింక్​కు సమీపిస్తోన్న గడువు
  • మార్చి 31తో ముగియనున్న లాస్ట్ డేట్
  • ప్రక్రియ పూర్తవకుంటే ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం!
PAN-Aadhaar: పాన్​-ఆధార్ లింక్​ చేశారా? ఇంకా ఆరు రోజులే గడువు!

PAN-Aadhaar: పాన్-ఆధార్​​ లింక్ చేసేందుకు తుడి గడువు దగ్గరకు వస్తోంది. ఈ ఈ నెలాఖరుతో (మార్చి 31) గడువు తేదీ ముగియనుంది. అంటే పాన్-ఆధార్​ అనుసంధానానికి ఇంకా ఆరు రోజులే మిగిలి ఉందన్నమాట.

నిజానికి రెండేళ్లుగా పాన్​-ఆధార్​ అనుసంధానానికి గడువు పొడగిస్తూ వస్తోంది ప్రభుత్వం. కరోనా నేపథ్యంలో గడువు పెంపు నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు కొవిడ్ తగ్గుముఖం పట్టింది. దీనితో మరోసారి గడువు పెంచే అవకాశం లేదని తెలుస్తోంది. కాబట్టి వీలైనంత త్వరగా ఆధార్​-పాన్ లింక్​ చేయకుంటే.. ఆ ప్రక్రియను పూర్తి చేయడం ఉత్తమమని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు.

పాన్ ఆధార్​ అనుసంధానం చేయండం ఎలా?

  • పాన్​- ఆధార్​ లింక్ కోసం ముందుగా.. ఇన్​కం ట్యాక్స్​ అధికారిక వెబ్​సైట్లోకి లాగిన్ అవ్వాలి. ఇందులో పాన్-ఆధార్ లింక్ అయ్యిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.
  • వెబ్​సైట్లో.. 'లింక్ ఆధార్​ స్టేటస్​' అనే ఆప్షన్​ కనిపిస్తుంది. దానిని ఎంచుకోవాలి
  • కొత్త విండోలో.. పాన్​-ఆధార్​ నంబర్లను నమోదు చేసి.. వ్యూ లింక్ ఆధార్​ స్టేటస్ క్లిక్​ చేయాలి.
  • ఇక్కడ ఆధార్​-పాన్​ స్టేటస్​ డిస్​ప్లే అవుతుంది. ఒకవేళ ఆధార్​ పాన్ లింక్ అయ్యుంటే.. పాన్-ఆధార్​ లింక్ అయ్యిందని.. అనుసంధానమై ఉందని రాసి ఉంటుంది. అలా కనిపించకుంటె వెంటనే ఆ పనిని పూర్తి చేయాలి.
  • ఇన్​కం ట్యాక్స్ వెబ్​సైట్లోనే.. ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.

గడువులోపు పాన్-ఆధార్ లింక్ చేయకుంటే?

గడువులోపు పాన్-ఆధార్​ లింక్ చేయకుంటే.. ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడుతుంది. పరిమితికి మించి లావాదేవీలు జరిపేందుకు వీలుండదు. ఇప్పటికే పలు బ్యాంకులు ఈ విషయాన్ని వినియోగదారులకు స్పష్టం చేశాయి కూడా. అంతే కాకుండా పాన్​ ఇన్​ యాక్టివ్​గా మారిపోతుంది. దీనితో పాటు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావడం, రూ.10 వేల జరిమానా పడే అవకాశం ఉంది.

Also read: Tata Nexon EV: టాటా నెక్సాన్ ఈవీ.. ఒక్కసారి ఛార్జ్​తో 400 కిలో మీటర్ల ప్రయాణం!

Also read: Aadhaar ration linking: ఆధార్​, రేషన్​ లింక్​కు గడువు పెంపు- కొత్త డేట్ ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News