OnePlus Nord CE 2 Launch Date: ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ కంపెనీ వన్ ప్లస్ నుంచి మరో మోడల్ అందుబాటులోకి రానుంది. ఇదే విషయమై ఇటీవలే అధికారిక ప్రకటన చేసింది. OnePlus Nord CE 2 Lite అనే వేరియంట్ ను ఈ నెల అనగా ఏప్రిల్ 28న భారత విపణిలోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఆ రోజున జరగబోయే మోర్ పవర్ టూ యూ (More Power To You) ఈవెంట్ లో ఈ వన్ ప్లస్ నార్డ్ సీఈ 5G మోడల్ ను ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా వన్ ప్లస్ మోడల్ వేరియంట్ ప్రత్యేకతలను సంస్థ ప్రకటించింది.
OnePlus Nord CE 2 Lite ఫీచర్స్..
వన్ ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ మొబైల్ 5000 MAH బ్యాటరీ బ్యాకప్ తో పాటు 33W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానున్నట్లు తెలుస్తోంది. కేవలం 30 నిమిషాల్లో 50 శాతంపైగా ఛార్జ్ అవుతుందని వన్ ప్లస్ సంస్థ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 65 5జీ చిప్ సెట్ చేసినట్లు సంస్థ తెలిపింది. 90hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల Full HD+ డిస్‌ప్లే తో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది.
వన్ ప్లస్ సంస్థ తయారు చేసే స్మార్ట్ ఫోన్స్ లో కెమెరా గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఈ మొబైల్ లోని ఫ్రంట్ కెమెరా (సెల్ఫీ కెమెరా) 16 MP హై రిజల్యూషన్ తో రానుంది. దీంతో పాటు ప్రైమరీ కెమెరా 64 MP OMNI విజన్, 2 MP (Macro), 2 MP (Mono) లెన్స్ ఫోన్ అందుబాటులో ఉండనుందని సమాచారం. దీంతో పాటు ఈ స్మార్ట్ ఫోన్ లో 8 GB RAM, 128 GB ROM ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉండనుంది.
ధర ఎంతంటే?
OnePlus Nord CE 2 సిరీస్ కంటే ఈ మోడల్ ధర తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. భారత్‌లో వన్ ప్లస్ సీఈ 2 లైట్ ప్రారంభ ధర గతంలో రూ.23,999గా ఉండేది. దీని బట్టి చూస్తే OnePlus Nord CE 2 స్మార్ట్ ఫోన్ ధర రూ. 20 వేల కంటే తక్కువ ధరకే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: Jio 4G Smartphone: రిలయన్స్ జియో సంచలన నిర్ణయం.. ఉచితంగా Jio 4G స్మార్ట్ ఫోన్!
Also Read: Flipkart Smart TV Offers: రూ.41 వేల విలువైన 50 అంగుళాల స్మార్ట్ టీవీని రూ.9 వేలకే కొనొచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook