NPS New Rules 2023: పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) నిబంధనల్లో మార్పులు చేసింది. డబ్బు విత్‌డ్రా చేసే నియమాల్లో మార్పులు చేసినట్లు వెల్లడించింది. సిస్టమాటిక్ లంప్ సమ్ విత్‌డ్రావల్ (SLW) సౌకర్యం ద్వారా ఒకేసారి మొత్తం కాకుండా.. దశలవారీగా విత్ డ్రా చేసుకుని అవకాశాన్ని కల్పించనుంది. మీ అవసరాన్ని బట్టి మీరు మెచ్యూరిటీ మొత్తాన్ని నెలవారీ లేదా త్రైమాసికం లేదా అర్ధ వార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన విత్‌డ్రా చేసుకోవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం.. కస్టమర్లు వారి సాధారణ పదవీ విరమణ సమయం ప్రకారం 75 సంవత్సరాల వయస్సు వరకు వారి పెన్షన్ ఫండ్‌లో 60 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని ఒకే వాయిదాలో అయినా.. లేదా వార్షిక ప్రాతిపదికన విత్‌డ్రా చేసుకోవచ్చు.
మీరు ఎన్పీఎస్ చందదారు అయితే.. మీరు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ మోడ్‌లో ఎంపిక కోసం దరఖాస్తు చేసుకోవాలి. నగదు విత్ డ్రా సమయంలో ప్రారంభ తేదీ, ముగింపు తేదీ మొదలైనవాటిని పేర్కొనాలి. SLW యాక్టివేట్ అయిన తర్వాత.. మీరు మీ ఎన్పీఎస్ అకౌంట్లో ఎలాంటి పెట్టుబడి పెట్టలేరు. మీరు ఎస్ఎల్డబ్ల్యూ ఆప్షన్‌ను ఎంచుకుంటే.. లిక్విడిటీ కొనసాగుతుంది. ఎన్పీఎస్ కస్టమర్లు తమ కార్పస్ ఫండ్‌లో దాదాపు 60 శాతం క్రమబద్ధమైన ఉపసంహరణలతో పాటు మొత్తం మొత్తాన్ని తీసుకోవచ్చు. అంతేకాకుండా మిగిలిన 40 శాతాన్ని పెన్షన్ కోసం ఉపయోగిస్తారు. టైర్-1 అకౌంట్లో ఎస్ఎల్డబ్ల్యూ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా విత్‌డ్రా చేసే డబ్బుకు పూర్తిగా ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. అయితే యాన్యుటీ నిబంధనలలో ఎలాంటి మార్పు చేయలేదు.
ప్రొటీజ్ సీఆర్ఏ ఎన్పీఎస్ సబ్స్క్రైబర్ల కోసం ఎస్ఎల్డబ్ల్యూ సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ సదుపాయంతో పదవీ విరమణ సమయంలో దశలవారీగా మొత్తం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు ఎంచుకున్న కాల వ్యవధిలో క్రమపద్ధతిలో కావలసిన మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఇది మ్యూచువల్ ఫండ్స్ కింద క్రమబద్ధమైన విత్ డ్రా తరహాలో ఉంటుంది. త్వరలో 60 ఏళ్లు పూర్తి చేసుకునే లేదా పథకం నుంచి నిష్క్రమించాలనుకునే పెట్టుబడిదారులకు కొత్త సౌకర్యం గురించి సమాచారాన్ని తెలుసుకోవాలని కోరారు. లంప్సమ్ విత్ డ్రా ఆప్షన్ గురించి సమాచారం ఇస్తూ సర్క్యులర్‌ను జారీ చేసింది.
Also Read: Chandrababu Case Updates: చంద్రబాబుకు ఊరట, మద్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి